‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్ తో మహేష్ కలెక్షన్స్ స్టామినా ఏమిటో మరోసారి టాలీవుడ్ కు ఋజువు అయింది. అయితే మహేష్ వ్యతిరేకులు మాత్రం ఈ బ్ల్లాక్ బస్టర్ హిట్ వెనుక ఉన్న ఒక అదృశ్య శక్తిని బయటకు తీస్తున్నారు. హిట్స్ లేక కటకతలాడుతున్న టాప్ హీరోలకు హిట్స్ అనుగ్రహించే దేవతగా మారిన శ్రుతిహాసన్ లక్ కూడ మహేష్ కు కూడ బాగా కలిసి వచ్చింది అంటూ ప్రిన్స్ మహేష్ పై కొందరు సెటైర్లు వేస్తున్నారు.
వీరు బయట పెడుతున్న కారణాల ప్రకారం తెలుగులో ఆమె ఇప్పటికే మూడు బ్లాక్ బస్టర్లు రెండు సూపర్ హిట్లు అందుకుంది అయితే ఈ 5 సినిమాలలో నాలుగు సినిమాల హీరోలు శ్రుతితో సినిమా చేయడానికి ముందు చాలా ఇబ్బందికర పరిస్థితులైన ఫ్లాప్స్ లో ఉన్నారు. పవన్ ఘోరమైన ఫ్లాపుల ఊబిలో ఉంటూ అయోమయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ‘గబ్బర్ సింగ్’ తో అదృష్ట దేవతగా మారింది శ్రుతిహాసన్.
శ్రుతి కెరియర్ ను మలుపు తిప్పిన ‘గబ్బర్ సింగ్’ సినిమానే తీసుకుంటే దానికి ముందు పవన్ కళ్యాణ్ పరిస్థితేంటో చెప్పాల్సిన పని లేదు. పదేళ్లపాటు తన స్థాయికి తగ్గ హిట్టు లేదు. పవన్ చివరి సినిమా ‘పంజా’ డిజాస్టర్ అయింది. శ్రుతి హీరోయిన్ గా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ రాత మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన రవితేజా ‘బలుపు’ విషయం తెలిసిందే. అరడజను దాకా ఫ్లాపులు వచ్చి చాలా దారుణమైన స్థితిలో రవితేజా ఉన్నప్పుడు శ్రుతితో జతకట్టగానే మాస్ రాజా అదృష్టం మారిపోయింది. రామ్ చరణ్ తో కూడా ‘ఎవడు’ లాంటి సూపర్ హిట్ ఇచ్చింది శ్రుతి. అలాగే అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఫ్లాప్ తర్వాత శ్రుతితో కలిసి చేసిన ‘రేసుగుర్రం’ అతడి కెరీర్లోనే అతి పెద్ద హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ‘వన్ నేనొక్కడినే’ ‘ఆగడు’ వరస పరజయాలతో టెన్షన్ లో పడ్డ మహేష్ కు చారుశీలగా జత కట్టడమే కాకుండా మహేష్ కలలో కూడ ఊహించుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది శ్రుతి గోల్డెన్ లెగ్. అయితే ఈ విశ్లేషణ చేస్తున్న వారి అభిప్రాయం ప్రకారం ఒక్క ఎన్టీఆర్ విషయంలో మాత్రమే శ్రుతి సెంటిమెంటు ఏ మాత్రం పని చేయలేదు. ‘రామయ్యా వస్తావయ్యా’ జూనియర్ కు ఎటువంటి చేదు అనుభవాన్ని మిగిల్చిందో తెలిసిన విషయమే. దీనితో భవిష్యత్తులో కూడా శ్రుతిహాసన్ తో నటించడానికి టాప్ హీరోలు అంతా మళ్ళీ ముచ్చట పడ్డా జూనియర్ మాత్రం శ్రుతి పేరు చెప్తే హడిలి పోతాడు అని సెటైర్లు వేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి