మెగాస్టార్ చిరంజీవి  షష్టి పూర్తి వేడుకల కౌంట్ డౌన్ మొదలు కావడంతో ఈ విషయానికి సంబంధించిన వార్తలు ఒక్కక్కటిగా లీక్ అవుతున్నాయి. చిరంజీవి షష్టిపూర్తి ఇన్విటేషన్ చాల డిఫరెంట్ గా చరణ్ డిజైన్ చేయించాడని వార్తలు వస్తున్నాయి. భాగ్యనగరంలోని పార్క్ హయత్ లో జరిగే చిరంజీవి షష్టిపూర్తి వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్స్ పై చరణ్ తో పాటు చిరంజీవి ఇద్దరు కూతుళ్ళ పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. 

ఈ ప్రోగ్రాం ను చాల వెరైటీగా డిజైన్ చేస్తున్న చరణ్ చిరంజీవి షష్టిపూర్తికి వచ్చే అతిదులందరికీ ఒక డ్రెస్ కోడ్ కూడ నిర్ణయించాడని ఫిలింనగర్ టాక్. ఈ డిన్నర్ పార్టీలో పాల్గొనే అతిధులు అంతా ఫార్మల్ డ్రెస్ తో బ్లాక్ టై కట్టుకుని ఆ డిన్నర్ పార్టీకి రావలసిందిగా చరణ్ కోరుతున్నాడని తెలుస్తోంది. ఈ డిన్నర్ పార్టీకి సినిమా రంగానికి చెందిన సెలెబ్రెటీలు మాత్రమే కాకుండా రాజకీయ రంగానికి సంబంధించిన అనేక మందు ప్రముఖులను కూడా వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఈ డిన్నర్ పార్టీ రాత్రి 8. 30 లకు ప్రారంభం అవుతుందని అంటున్నారు. చిరంజీవి ఫంక్షన్ లో అటు సాంప్రదాయాన్ని ఇటు మోడ్రన్ అవుట్ లుక్ ను కలబోసే విధంగా చిరంజీవి షష్టిపూర్తి వేడుకలను డిజైన్ చేసారు అని అంటున్నారు. ఈవార్తలు ఇలా ఉండగా చిరంజీవి తన అభిమానులతో నిర్వహించే భారీ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులంతా హాజరై మెగా అభిమానులకు జోష్ కలిగిస్తారని టాక్. 

అయితే ఈ షష్టిపూర్తి వేడుకలకు సంబంధించి ఒక్క పవన్ విషయంలోనే క్లారిటీ లేదు అని అంటున్నారు. చిరూ షష్టిపూర్తి పూర్తి సందర్భంగా ఏ ర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలలోనూ పవన్ కనిస్తాదా?  ఒక్క డిన్నర్ పార్టీలో కాని మెగా అభిమానులతో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో కాని ఎదో ఒక కార్యక్రమంలో పవన్ కనిపించి మురిపిస్తాడా లేదంటే తన షాక్ లను ఇంకా కొనసాగిస్తూ షష్టిపూర్తి వేడుకలకు పవన్ దూరంగా ఉంటాడా అన్న ఆశక్తి పవన్ అభిమానులకే కాకుండా ఆ కార్యక్రమానికి హాజరౌతున్న అతిధులకు కూడ మనసులో ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: