టాలీవుడ్
యువ నటుడు
నితిన్ హీరోగా ఇటీవల
యువ దర్శకుడు
వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ
సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ
సినిమా లో
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఒకప్పటి సీనియర్ యాక్టర్
అనంత్ నాగ్ కీలక పాత్రలో నటించారు. ఇక దాని తరువాత కొద్దిరోజుల క్రితం టాలెంటెడ్ దర్శకుడు
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన
చెక్ సీనియా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన
నితిన్ అనూహ్యంగా దానితో పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
ప్రియా ప్రకాష్
వారియర్,
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో పోసాని
కృష్ణ మురళి, సాయి చంద్,
మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు చేసారు. ఈ
సినిమా కోసం దర్శకుడు
చంద్రశేఖర్ యేలేటి ఎంచుకున్న స్టోరీ అయితే బాగుందని, కానీ ఆయన దానిని కథనంగా మలిచిన తీరు అంతగా ఆకట్టుకునేలా లేదని పలువురు ప్రేక్షకులు బహిరంగంగానే విమర్శలు చేసారు. ఓవరాల్ గా పర్వాలేదనిపించిన ఈ
సినిమా చాలా చోట్ల తక్కువ కలెక్షన్ అందుకోవడం ఒకింత
చెక్ యూనిట్ కి కూడా షాక్ ఇచ్చినట్లు చెప్తున్నారు.
మొదటి నుండి కూడా తన టాలెంటెడ్ స్క్రీన్ ప్లే తో సినిమాలు తీసి ఆకట్టుకునే
చంద్రశేఖర్ ఏలేటి ఈ
మూవీ పరాజయంతో తదుపరి
మూవీ పై మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే
మూవీ పై
నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై
నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులోని సాంగ్స్, టీజర్
ఆడియన్స్ నుండి మంచి స్పందన రాబట్టాయి. మరి ఈ
మూవీ ఎంతవరకు
నితిన్ కి
సక్సెస్ అందిస్తుందో చూడాలి..... !!