ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రమ్యకృష్ణ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన చిన్ననాటి ఫోటోలను, తాను హీరోయిన్ గా నటించిన అప్పుడు ఫోటోలు కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా  రమ్యకృష్ణ నటించిన  లైగర్ మూవీ సెట్స్ నుంచి రమ్యకృష్ణ ఫోటోలు లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫోటోలు  బయటకు రావడం అన్ని సోషల్ మీడియాల్లో  హల్చల్ చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో రమ్య కృష్ణ మరోసారి ఒక సరికొత్త ఫోటోను పోస్ట్ చేసారు. ఆ ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు.



అప్పట్లో హీరోయిన్ పాత్రలు వేసేటప్పుడు రమ్యకృష్ణ చాలా  హాట్ గా ఉండేది. గ్లామరస్ రోల్స్‌ లో నటించిన రమ్యకృష్ణ తనదైన శైలిలో అప్పట్లో కుర్రకారును ఒక ఊపు ఊపింది ఎంతో మంది దర్శకులు కూడా రమ్యకృష్ణను తెరపై అందంగా చూపించారు. అందరి అగ్ర హీరోల సరసన నటించింది రమ్య కృష్ణ. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకున్నది. కొన్నాళ్ల తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఒక్కసారిగా రమ్యకృష్ణ ఇమేజ్ ను అమాంతం పెంచేసిన సినిమా బాహుబలి అని అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో శివగామి పాత్రతో రమ్యకృష్ణ పేరు మారు మోగిపోయింది..



రమ్యకృష్ణకు అటు  వెండితెర, ఇటు బుల్లితెరపై కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.జీ తెలుగులో ఛానెల్ లో నాగ భైరవి అనే పవర్ ఫుల్ పాత్రలో  రమ్యకృష్ణ నటిస్తున్నారు. అంతే యాక్టీవ్ గా సోషల్ మీడియాలో కూడా  రమ్యకృష్ణ షేర్ చేసే ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా రమ్యకృష్ణకి సంబందించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా రమ్య కృష్ణ  బికినీలో దర్శనమిచ్చింది. బికినీ వేసుకుంది అని తెలుస్తుంది తప్పా ఎక్కడ కూడా అంద చందాల ఆరబోత కనపడనీయలేదు. హాయిగా స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతూ సెల్ఫీ దిగింది. అయితే ఇందులో రమ్యకృష్ణ అందాలేవీ బయటపడలేదు. దీంతో నెటిజన్లు అందరూ డీలా పడ్డారు. రమ్యకృష్ణ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. 








మరింత సమాచారం తెలుసుకోండి: