టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ కు ప్రేక్షకాభిమానుల్లో రోజు రోజుకు విపరీతమైన క్రేజ్ పెరుగుతోందని, అలానే ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ నమోదు చేసిన సూపర్ స్టార్ జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకుని మరింత వేగవంతంగా ముందుకు దూసుకువెళ్ళే ఛాన్స్ కూడా కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా మహేష్ అంటే ప్రేక్షకులు, అభిమానులతో పాటు పలువురు నటీనటుల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.
కొందరు హీరోయిన్స్ అయితే మహేష్ తో ఒక్క సినిమా ఛాన్స్ కోసం ఎప్పటి నుండి ఎంతో ఆశగా ఎదురు చూపులు చూస్తున్నవారున్నారు. ఆ విధంగా మహేష్ కు క్రేజ్, పాపులారిటీ అనన్యసామాన్యం అనే చెప్పాలి. ఇక తరచు ఎవరో ఒక హీరోయిన్ సూపర్ స్టార్ గురించి మాట్లాడుతూ, ఆయన అభిమానిని అని చెప్తూ ఉండడం పలు మీడియా మాధ్యమాల్లో చూస్తూ ఉంటాము. అయితే అటువంటి వారి లిస్ట్ లో నేడు మరొక హీరోయిన్ కూడా చేరిపోయారు. ఆమె మరెవరో కాదు యువ భామ మాళవిక మోహనన్.

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మాస్టర్ లో హీరోయిన్ గా నటించిన మాళవికమూవీ సక్సెస్ తో మంచి పేరు దక్కించుకుంది. అసలు మ్యాటర్ ఏమిటంటే కొద్దిసేపటి క్రితం, మీలో ఎవరు ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు అంటూ ఒక అభిమాని, మహేష్ తో మాళవిక కలిసిన ఒక ఫోటో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా, అది చూసిన మాళవిక నేను అంటూ అతడికి రిప్లై ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ పోస్ట్ సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ విధంగా సూపర్ స్టార్ మహేష్ అందానికి మరొక హీరోయిన్ ఫిదా అంటూ పలువురు మహేష్ ఫ్యాన్స్, త్వరలోనే ఈ కాంబో సెట్ కావాలని కోరుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఒకరకంగా తన రిప్లై తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మాళవిక కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: