ఇక వీరిద్దరూ కలిసి ఇటీవల ముచ్చటగా మూడోసారి పనిచేసిన సినిమా క్రాక్. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా గోపీచంద్, రవితేజ కాంబినేషన్ లో హ్యాట్రిక్ నమోదు చేసింది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బి మధు నిర్మించిన ఈ సినిమాలో పోతురాజు వీర శంకర్ అనే పాత్రలో రవితేజ వండ్రఫుల్ పెర్ఫామెన్స్ చేశారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దానికి కొంత కల్పిత కథను జోడించి దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నటసింహం బాలయ్య తో ఒక మూవీ చేయనున్నారు గోపీచంద్. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి క్రాక్ మూవీ మాదిరిగా ఈ సినిమా కూడా కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనుందని ఇటీవల బాలయ్యని కలిసి ఒక అద్భుతమైన స్టోరి వినిపించిన గోపీచంద్ ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని అంటున్నారు. అలానే ఈ సినిమాకు సంబంధించి పూర్తి అఫిషియల్ న్యూస్ అతి త్వరలో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. మరి తొలిసారిగా బాలయ్య, గోపీచంద్ ల కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ల వరకు వెయిట్ చేయక తప్పదు..... !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి