ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కేవలం థియేటర్లోనే విడుదల చేస్తామని, ఈ విషయంలో దిల్ రాజు గారు ఏ మాత్రం రాజీ పడడం లేదని తెలిపారు విశ్వక్ సేన్. మాములుగా అయితే ఇంతకు ముందు ట్రైలర్ లు అన్నీ కూడా థియేటర్లోనే విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం కాలంలో సామాజిక మాధ్యమాలు మరియు స్మార్ట్ ఫోన్ లు ఎక్కువ అయిపోవడం వలన ఎక్కువగా వీటిలోనే ప్లే చేస్తున్నారు. అయితే ఈ సారికి మా చిత్ర యూనిట్ అంతా ఈ సినిమా ట్రైలర్ ను థియేటర్లోనే విడుదల ప్లాన్ చేస్తున్నాము. అయితే ఈ సందర్భంగా ఈ రోజు విశ్వక్ సేన్ తన పుట్టినరోజు కాబట్టి ఈ విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. పాగల్ సినిమా షూటింగ్ అంతా నేటితో ముగియనుంది. త్వరలో ఏ సినిమాకు సంబంధించి అన్ని వివరాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తామని తెలిపారు.
ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా తెలుగు రాష్ట్రాలలో పాగల్ టీం రధ యాత్ర చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే విడుదల చేసిన పాగల్ సినిమా టీజర్ కి మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీని తరువాత సినిమా ప్రాజెక్ట్ గామీ కూడా షూటింగును పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఒక క్లాసిక్ అడ్వెంచర్ గా తెరకెక్కింది. వీటి తరువాత ఒక చిత్రం ఒక పెద్ద నిర్మాణ సంస్థలో చేస్తున్నానని తెలిపారు. ఏ సంవత్సరం మొత్తం మూడు సినిమాలు విడుదల కానున్నాయి అని తన భావాలను పంచుకున్నారు విశ్వక్ సేన్. మరి ఈ సినిమాలు అన్నీ తనకు మంచి పేరును తీసుకురావాలని ఆశిద్దాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి