తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్  ,రాజీవ్ కనకాల అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అంతే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో వీరు చాలా రోజులనుంచి ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. రాజీవ్ కనకాల హీరోగా అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ హీరో కాలేకపోయాడు. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూనే హీరోలతో సమానంగా అవార్డులు కూడా అందుకున్నాడు. ప్రముఖ దర్శకుడు,నటుడు దేవదాస్ కనకాల కుమారుడైన ఈయన టీవీ సీరియల్ నుంచి తన సినీ ప్రస్థానం మొదలై,  ఆ తరువాత పలు సినిమాల్లో  అనేక అవకాశాలు చేజిక్కించుకున్నాడు.


రాజీవ్ కనకాల మెగా హీరోలతో ఎందుకు సినిమా చేయడం లేదనే టాక్ విపరీతంగా ఉంది. రాజీవ్ కనకాల తెలుగు సినిమా పరిశ్రమలో మంచి పేరుంది. పలు విజయవంతమైన సినిమాల్లో ఆయన యాక్టింగ్ పరంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆయన సతీమణి' సుమ' ప్రముఖ యాంకర్. ఆమె దాదాపు  దశాబ్దం కంటే ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని షో లకు యాంకర్ గా వహిస్తూనే, మరి కొన్ని ఆడియో లాంచ్ లో   సినిమా ప్రోగ్రాములకు యాంకరింగ్ చేస్తున్నారు.

ఇక అటు రాజీవ్ కనకాల, ఇటు సుమ ఇద్దరూ సినీ ఇండస్ట్రీ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా రాజీవ్ కనకాల అలాగే  పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎందుకు కలిసి చేయడం లేదనే వాదన పుట్టుకొచ్చింది. అయితే ఆయన ఓ సందర్భంగా మాట్లాడుతూ.. " అవకాశం వస్తే ఏ హీరోతో నైనా చేస్తానని చెప్పాడు.అంతెందుకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ తో నాయక్, అల్లు అర్జున్ తో రేసుగుర్రం లో నటించాను కదా..!" అని బదులిచ్చాడు. ఇక ఎన్టీఆర్ రాజీవ్ కనకాల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ మంచి స్నేహితులు. మిగతా అందరితో నటించిన రాజీవ్ కనకాల పవన్ కళ్యాణ్  తో నటించకపోవడానికి కారణం ఏంటో చెప్పమని కొందరు నెటిజన్లు అడిగారట. దీనికి రాజీవ్ కనకాల సమాధానంగా   సినిమాల్లోని వారందరూ కుటుంబ సభ్యులుగా ఉంటాం.. మా మధ్య చిచ్చు పెట్టకండి.  అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని రాజీవ్ కనకాల అనేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: