తెలుగులో మంచి టాక్ ను అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది..తాజాగా సోమవారం తన 25వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది రష్మిక మందన్నా. ఈ సందర్బంగా ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి రష్మికకి సంబంధించిన ఓ అరుదైన వీడియోని పంచుకుంటూ బర్త్ డే విషెస్ తెలిపారు. ఇది ఆమె `కిరిక్ పార్టీ` కోసం ఇచ్చిన మొదటి ఆడిషన్. ఈ వీడియో పంచుకుంటూ, `కిరిక్ పార్టీ` ఆడిషన్‌లోని మధురానుభూతులను షేర్ చేస్తున్నాను. అప్పటి నుంచి నీ ప్రయాణం ఎంతో సాహసోపేతంగా సాగింది. రియల్ వారియర్‌లా నీ కలలను చేధించుకుంటూ వెళ్తున్నావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే. నువ్వు మరెన్నో విజయాలు సాధించాలి` అని పోస్ట్ లో పేర్కొన్నాడు.
తాజాగా ఈ విషయం పై స్పందించిన రష్మిక అతనికి కృతజ్ఞతలు తెలిపారు..ఇక ఈ వీడియోలో కళ్లజోడు పెట్టుకున్న రష్మిక పేపర్‌లో ఉన్న డైలాగ్స్ నేర్చుకుంటూ అప్పజెబుతోంది. అలాగే అక్కడున్న వారితో కాస్త సీరియస్‌గా, కాస్త నవ్వుతూ మాట్లాడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే రష్మిక బర్త్‌డేను పురస్కరించుకుని 'పుష్ప', 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ హీరోయిన్ మాత్రం తన బర్త్‌డే రోజు కూడా షూటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. ఇటు తెలుగు, అటు హిందీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి