ఈసారి ఇప్పటివరకూ తన కెరీర్లో నటించనీ ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఏకంగా ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. సుకుమార్ సినిమా అంటే కాలిక్యులేషన్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో క్యాలిక్యులేషన్ ఎలా ఉంటాయని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇటీవలే పుష్పరాజ్ అనే పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ వీడియోలో అల్లు అర్జున్ ను చూసి అటు అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియో చివర్లో ఇక అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ కాకుండా ఐకాన్ స్టార్ అంటూ సరికొత్త స్టార్ డమ్ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్.
అయితే స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ గా ఎందుకు మార్చారు అని ఎవరికీ అర్థం కాలేదు దీనికి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ కూడా కొనసాగుతుంది. అయితే ఇటీవలే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాదు ఐకాన్ స్టార్ అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు దర్శకుడు సుకుమార్. ఇటీవలే బన్నీ పుష్ప ఫస్ట్ మీట్లో మాట్లాడిన దర్శకుడు సుకుమార్.. బన్నీకి స్టైలిష్ స్టార్ అని ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు కానీ పుష్ప సినిమా చేసిన తర్వాత ప్రామిస్ గా చెబుతున్నాను ఆయన నటన చూసిన తర్వాత ఆయనకు కేవలం స్టైలిష్ స్టార్ అని ఒక్కటే ఉంటే సరిపోదు అని అనిపించింది.. అల్లు అర్జున్ ఒక ఐకాన్ స్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు దర్శకుడు సుకుమార్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి