కే జి ఎఫ్ సినిమా అదిరిపోయే విజయం సాధించడంతో ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి చిత్రబృందం నిర్ణయించింది. కేజిఎఫ్ సీక్వెల్ కోసం ప్రస్తుతం అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ తో అభిమానులు అందరిలో మరింత అంచనాలు పెరిగిపోయాయి చెప్పాలి. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా నటిస్తుండటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాదులోనె దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది
అయితే కే జి ఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కే జి ఎఫ్ వన్ లో తన తల్లి చెప్పినట్లుగానే రాఖీ ధనవంతుడు గానే చనిపోతాడని అలా కే జి ఎఫ్ కథ అంతమవుతుంది అన్న ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్త అటు రాఖీ బాయ్ అభిమానులను మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కే జి ఎఫ్ చాప్టర్ 2 లో నిజంగానే రాఖీ బాయ్ పాత్ర ముహుస్తుందా అలా జరగక పోతే బాగుండు అని అభిమానులు భావిస్తున్నారు అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే మాత్రం సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి