మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి కేరెర్లోనే పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ఠాగూర్.ఫ్యాన్స్ కి ఈ సినిమా ఎంతగానో ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఇక అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం తమిళంలో ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ రమణ సినిమాకు రీమేక్ గా వీవీ వినాయక్ డైరెక్షన్ లో ఠాగూర్ తెరకెక్కింది. చిరు ఇమేజ్ ను పెంచిన సినిమాల్లో ఠాగూర్ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. అవినీతి, లంచగొండితనాన్ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

అయితే చిరంజీవి మళ్లీ ఠాగూర్ పాత్రను పోలిన పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న చిరంజీవి ఈ సినిమా తరువాత లూసిఫర్, వేదాళం రీమేక్ లతో పాటు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలలో ఏ డైరెక్టర్ సినిమా ఫస్ట్ మొదలవుతుందో తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ డైరెక్షన్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా తెరకెక్కనుండగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇక ఠాగూర్ సినిమాలా మంచి ఎమోషనల్ డ్రామాగా చిరంజీవి బాబీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతుంది . ఠాగూర్ సినిమాలోలా సమాజంలోని లోపాలను ఎత్తి చూపే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని ఈ సినిమాకు దర్శకుడు బాబీ వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక ఠాగూర్ తరహాలో రాబోతున్న ఈ సినిమా మళ్ళీ ఆ సినిమా లాగే ఇంకెన్ని కొత్త రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: