కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకి చాలా ఎక్కువ అవుతుంది. ప్రపంచమంతా ఈ వైరస్ వ్యాపించి చాలా తీవ్రంగా వుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించిన కాని ఈ కరోనా మహమ్మారీ మాత్రం రోజు చాప కింద నీరు లాగా వ్యాపిస్తూనే వుంది. ఇక గత మూడు రోజుల క్రితం ప్రముఖ
కమెడియన్ కరోనా బారిన పడి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక మళ్ళీ అకస్మాత్తుగా
గుండె పోటు రావడంతో హాస్పిటల్ లో కన్నుమూశారు. ఇక ఆ బాధని మరిచిపోయేలోపే మళ్ళీ
సినిమా ఇండస్ట్రీ కి షాక్ తగిలింది. ప్రముఖ టాలీవుడ్ సీనియర్ కోడైరెక్టర్ సత్యం కన్నుమూశారు. కరోనాతో కొద్దిరోజులుగా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం ఉదయం ప్రాణాలు విడిచారు. వైద్యులు మెరుగైన చికిత్సను అందించినప్పటికీ బతికించలేకపోయారు. సత్యం మరణ వార్తతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా షాక్ కి గురయ్యారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.సత్యం చాలా సినిమాలకు పని చేశారు. ఇక కొన్ని కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు కూడా ఆయన పోషించడం జరిగింది.

ఇక దర్శకత్వ విభాగంలో పనిచేసిన సత్యం ఎన్నో సినిమాలకు పని చేశారు. ముఖ్యంగా క్రియేటివ్
డైరెక్టర్ కృష్ణవంశీ, దర్శకధీరుడు
రాజమౌళి, మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర ఆయన సహాయకుడిగా పని చేశారు. ఆ దర్శకులు తెరకెక్కించిన ఎన్నో భారీ హిట్ సినిమాల్లో భాగం అయ్యారు.అలాగే వారికి మంచి సన్నిహితుడు కూడా.ఇక అలాగే
అనిల్ రావిపూడి "ఎఫ్ 2" సినిమాలో కూడా నటించి తనదైన శైలిలో తన నటనతో ఆకట్టుకున్నారు.ఇక గమనించినట్లయితే ఈ మధ్య చాలా మంది సెలెబ్రెటీలు కరోనా బారిన పడ్డారు. రీసెంట్ గా
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విధంగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం తమ అభిమానులకి భయాందోళన కలిగిస్తుంది.