కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి. చరిత్రలో ఎన్నటికి నిలిచిపోతుంటాయి. అలాగే గర్వించదగ్గ చిత్రాలు అవుతాయి. అలాంటి సినిమాలు వాటి రికార్డుల గురించి పెద్దగా ఎవరికి తెలియవు. ఇక మన తెలుగు సినిమా అది మెగాస్టార్ చిరంజీవి సినిమా వరల్డ్ రికార్డు సృష్టించిన సంగతి చాలా కొద్ది మందికే తెలుసు. ఇక ఆ సినిమా ఏంటి.. ఆ సినిమా సృష్టించిన వరల్డ్ రికార్డు గురించి తెలుసుకోండి..మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో మొదటిసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేసిన మూవీ 'ఇంద్ర'. బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2002 వ సంవత్సరం జూలై 24న విడుదలైన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్‌, సోనాలి బింద్రె హీరోయిన్లుగా నటించారు. 'వైజయంతి మూవీస్' బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 18 ఏళ్లు క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి కూడా చూసేవారికి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.


ఇంద్ర సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇంద్రసేనా రెడ్డిగా చిరు చెప్పే డైలాగ్స్ ను ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటారు ప్రేక్షకులు.ఆ రోజుల్లోనే రూ. 38 కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీ ఇది. అంతేకాదు అత్యధికంగా 127 కేంద్రాలలో 100 రోజులు ఆలాగే 35 కేంద్రాలలో 175 రోజులు ఆడిన ఘనత 'ఇంద్ర' సినిమాది. ఈ సినిమాకి ముందు చిరంజీవి వరుస ప్లాపులు ఎదురుకున్నాడు. దాంతో మెగాస్టార్ పని అయిపోయింది ఇక అని అందరూ అనుకున్నారు. కాని వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా రికార్డు స్థాయిలో చిరంజీవికి కమ్ బ్యాక్ హిట్ ని ఇచ్చింది.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన వన్ అండ్ ఓన్లీ తెలుగు మూవీ 'ఇంద్ర'. అప్పటిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు పైగా 'ఇంద్ర' టికెట్లు అమ్ముడయ్యాయట.ఇది నిజంగా పెద్ద రికార్డనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: