అయితే ప్రస్తుతం బోయపాటి తన సక్సెస్ ఫుల్ కాంబో ను రిపీట్ చేస్తున్న విషయం తెలిసిందే. నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా BB3. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నందమూరి ఫ్యాన్స్ అభిరుచులకు అనుగుణంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు బోయపాటి. ఈ సినిమాకి ' అఖండ'అనే టైటిల్ ని ఖరారు చేశారు. ''సింహా, లెజెండ్'' లాంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత ఈ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ ఖాయం అంటున్నారు నందమూరి అభిమానులు. అయితే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవడంతో...బోయపాటి తదుపరి ప్రాజెక్ట్ పై పలు కథనాలు వినబడుతున్నాయి.
బోయపాటి తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఫిక్స్ అయిందని, కాదు రామ్ చరణ్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇప్పటికే నటీనటులను కూడా సెలెక్ట్ చేశారని ఇలా పలురకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి బోయపాటి శ్రీను.. బాలకృష్ణ చిత్రం తర్వాత అదే ఫ్యామిలీ యువ హీరో అయిన కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యారట. ఓ రకంగా ఇది ఒప్పందం అని తెలుస్తోంది. కెరీర్ ని మలుపుతిప్పే హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు ...బాబాయ్, తమ్ముడు ఎన్టీఆర్ కలసి ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినికిడి. ఈ సినిమాకోసం నిర్మాతలు బోయపాటి, కళ్యాణ్ రామ్ లకు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి మరీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే అటు బోయపాటికి కళ్యాణ్ రామ్ కి ఇద్దరికీ ప్లస్ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి