అయితే ఈ టాలెంటెడ్ గర్ల్ సినీ పరిశ్రమలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వ్యక్తపరిచింది. తను సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో తనకు అవకాశం ఇచ్చారని... అయితే అందులో తనను హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు ఆ డైరెక్టర్ తనకు కమిట్మెంట్ కోసం ఒత్తిడి చేశాడని చెప్పుకొచ్చింది. కానీ నా మనసు అందుకు అంగీకరించలేదు... కుదరదని కరాఖండిగా తేల్చి చెప్పేసాను. దాంతో ఆ పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం దూరం అయింది. అయినా నాకు బాధ అనిపించలేదు.
కానీ ఆ దర్శకుడు మాత్రం నన్ను వదల లేదు..చాలా సార్లు మళ్లీ నాకు ఫోన్ చేసి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తానన్నాడు.. అయినా నేను నిరాకరిస్తూనే వచ్చాను. నాకు సినిమా అంటే పాషన్, కానీ అందుకోసం ఏదైనా చేసేయాలి అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు, రాదు కూడా అని తన ఆవేదనను వెల్లడించింది ప్రాచీ. వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై, బోల్ బచ్చన్ వంటి హిందీ మూవీలలో నటించిన ఈమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి