ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ‘వకీల్ సాబ్’ మూడవ వారంలోకి ఎంటర్ అవ్వకుండానే దాని హవా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా మాయమైపోయింది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు వల్ల తెలంగాణ రాష్ట్రంలో ధియేటర్లు మూత పడటంతో ‘వకీల్ సాబ్’ ధియేటర్లు కూడ మూత పడ్డాయి.


వాస్తవానికి ‘వకీల్ సాబ్’ మూవీని ప్రదర్శించుకోవడానికి అనుమతులు వచ్చినా ఈమూవీని ప్రదర్శిస్తున్న ధియేటర్ల యజమానులు ఆశక్తి కనపరచక పోవడంతో ఈమూవీ కూడ మూడవ వారం ఎంటర్ కాకుండానే తన హవాను ముగించింది. ఇలాంటి పరిస్థితులలో ‘వకీల్ సాబ్’ బయ్యర్లకు లాభాలు వచ్చాయా లేకుంటే నష్టాలు వచ్చాయా అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


ఈ చర్చలు ఇలా కొనసాగుతూ ఉండగానే ఈమూవీకి సంబంధించి పవన్ కు ఇచ్చిన పారితోషికం పై ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీలో మొదలయ్యాయి. ఇప్పటివరకు హడావిడి చేసిన వార్తల ప్రకారం ఈమూవీలో నటించినందుకు పవన్ కు పారితోషికంగా 50 కోట్లు ఇచ్చారు అన్నప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరొక సరికొత్త ప్రచారం మొదలైంది. ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీలో నటించినందుకు పవన్ కు 65 కోట్లు పారితోషికం ఇచ్చారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఈమూవీ ప్రారంభానికి ముందు పవన్ తో జరిగిన ఒప్పందం ప్రకారం పవన్ కు పారితోషికంగా 50 కోట్లు లాభాలలో కొంత శాతం ఇవ్వడానికి దిల్ రాజ్ అంగీకరించాడు అని అంటారు. అయితే ఈమూవీ విడుదలకు ముందు ఈమూవీకి వచ్చిన విపరీతమైన హైక్ రీత్యా ఈమూవీ లాభాలతో పవన్ కు సంబంధం లేకుండా 65 కోట్లు పారితోషికంతో ‘వకీల్ సాబ్’ డీల్ ను పూర్తి చేసారు అన్న టాక్ వస్తోంది. ఇదే సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ కు కోటి రూపాయలు పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్తలే నిజం అయితే ప్రస్తుతం పవన్ మ్యానియా సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఏవిధంగా ఉందో అర్థం అవుతుంది..





మరింత సమాచారం తెలుసుకోండి: