అయితే ఈ స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ తో తెలుగులో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట సుస్మిత. ఇప్పటికే రీమేక్ రైట్స్ ను కూడా సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఏ హీరోతో చేయబోతున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సినిమా కథ మొత్తం ఒక తుపాకీ చుట్టూ తిరుగుతుందట. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. గతంలో చిరు మరియు చెర్రీలు నటించిన పలు సినిమాలకు సుస్మిత క్యాస్టూమ్ డిజైనర్ గా వర్క్ చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు.
అంతే కాకుండా ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ కూడా నిర్మించగా, ఇప్పుడు వెండితెరపై నిర్మాతగా రాణించాలని కోరుకుంటున్నారు. మరో వైపు ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లో ఎక్కువగా రీమేక్ ల హవా నడుస్తుండగా... ఇప్పుడు చిరు కుమార్తె కూడా రీమిక్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న వార్త విశేషం అనే చెప్పాలి. అయితే ఈమెకు నిర్మాతగా ఈ సినిమా మంచి ఆరంభాన్ని ఇస్తుందా...? లేదా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి