తెలుగు సినిమా పరిశ్రమలో శోభన్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన అందంతో పాటు మంచి నటనతో స్టార్ హీరోగా ఎదిగాడు. అంతే కాకుండా ప్రేక్షకుల చేత" సోగ్గాడు " అని కూడా పిలిపించుకున్న ఏకైక స్టార్ హీరో శోభన్ బాబు.సీనియర్ ఎన్టీఆర్, ఏ.ఎన్.అర్ వంటి స్టార్ హీరోలు ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలో , ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి , బ్లాక్ బాస్టర్ లు హిట్ లు కొట్టి వారికి చెమటలు పట్టించాడు.. ఫ్యామిలీ మూవీస్ తో పాటు లవ్ స్టోరీ లో కూడా నటించి, అప్పట్లోనే ఓ ట్రెండ్ ను సెట్ చేశాడు.. అయితే కొత్త హీరోల పోటీ తరుణంలో ఆయన సెకండ్ హీరోగా కూడా కొన్ని పాత్రలు చేశాడు. కానీ ఆయనని ప్రేక్షకులు హీరోగానే యాక్సెప్ట్ చేశారు.. అయితే శోభన్ బాబు గారు కొన్ని మంచి పాత్రలు మిస్ చేసుకున్నారు అవేంటో ఒకసారి చూద్దాం.
1) అన్నమయ్య: ఈ చిత్రంలోని వెంకటేశ్వరస్వామి పాత్రకు ముందుగా శోభన్ బాబు గారిని అనుకున్నారు. కానీ ఆయన పాత్ర రిజెక్ట్ చేయడంతో సుమన్ ను ఈ పాత్రకు ఎంపిక చేసుకున్నారు.
2). సుస్వాగతం: పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రంలో హీరో పాత్రకి శోభన్ బాబు ను ఎంపిక చేయాలని నిర్మాత ఆర్.బి.చౌదరి ప్రయత్నించాడు. కానీ అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదు.
3). బ్లాక్ : అంతేకాకుండా ఆర్.బి.చౌదరి గారు, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందిన బ్లాక్ చిత్రాన్ని కూడా తెలుగులో శోభన్ బాబు తో రీమిక్స్ చేయాలనుకున్నారు. కానీ అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదు.
4). అతడు: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా ఎంత హిట్ అయ్యిందో మనకు చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలోని నాజర్ పోషించిన సత్యనారాయణమూర్తి పాత్రకు మొదట శోభన్ బాబు నీ అనుకున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయనను అడగగా ఈ ఆఫర్ కు నో చెప్పారట..
ఇక ఈ పాత్రలన్నీ శోభన్ బాబు గారు చేసి ఉంటే ఆయన స్టార్ వేరే లెవెల్ లో ఉండేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి