కరోనా వచ్చిన తర్వాత చాలా వరకు థియేటర్లు మూత పడిన విషయం తెలిసిందే .ఆ తర్వాత కరోనా కొంచెం తగ్గుముఖం పట్టడంతో, తిరిగి తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కొన్ని నెలలపాటు థియేటర్లు తెరుచుకున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం అలా జరగలేదు. అక్కడి ప్రేక్షకులు మాత్రం థియేటర్లలో సినిమా చూడాలి అని తెగ ముచ్చట పడుతున్నప్పటికీ , కరోనా కరుణించడం లేదు.. సాధారణంగా నార్త్ ప్రజలు హిందీ సినిమాలను కూడా పక్కనపెట్టి ,మన తెలుగు సినిమాలను ఎక్కువగా వీక్షిస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం.. అయితే మన తెలుగు సినిమాలను హిందీలోకి డబ్ చేసి, విడుదల చేయగా అక్కడ బిలియన్స్ లో వ్యూస్ నమోదు అవుతుండడం కూడా మరో విశేషం..
కానీ ఎప్పుడో తెలుగులో తొమ్మిదేళ్ల క్రితం వచ్చి హిట్ అయిన సినిమా, ఇప్పుడు హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చేయగా దానికి కూడా 50 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.. ఇంతకూ ఆ సినిమా ఏంటని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నా ..పూర్తి వివరాల్లోకి వెళితే, 2012లో బి.జయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లవ్లీ.. ఈ చిత్రం ఎంత మంచి విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు.. ఇందులో కథానాయకుడిగా సాయికుమార్ తనయుడు ఆది సాయి కుమార్, కథానాయికగా జాన్వీ కలిసి నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ లు కీలకపాత్రలు పోషించారు.
అనూప్ రూబెన్స్ సంగీతం లో రూపొందించిన ఈ చిత్రం పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇక ఈ చిత్రానికి .." ఆర్.ఆర్. మూవీ ,ఆర్జే సినిమా బ్యానర్లపై ఆర్.ఆర్.వెంకట్, బీ ఏ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉండగా గత తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేసి , యూట్యూబ్లో విడుదల చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్ లకు పైగా వ్యూస్ నమోదుచేసుకొని సరికొత్త రికార్డును సృష్టించింది.
అయితే ఈ సినిమా తెలుగులో లవ్లీ పేరుతో విడుదల అవగా, ఇక హిందీలో "విజయ్ మేరీ హై " అనే టైటిల్ తో హిందీలో రీమేక్ చేయబడి, యూట్యూబ్ లో విడుదల అయ్యింది. అయితే ఇప్పుడు ఆది కూడా ఊహించని రేంజ్ లో ఆయనకు అదృష్టం వరించింది అని నెటిజన్లు అంతా భావిస్తున్నారు.. ఇక అంతే కాకుండా ఆది ఏంటయ్యా నీ అదృష్టం అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి