క్రేజీ హీరోయిన్స్ పై డేటింగ్ రూమర్స్ రావడం సర్వసాధారణం. అలాంటి రూమర్స్ లేకుండా హీరోయిన్స్ కెరియర్ ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో డేటింగ్ పై రష్మిక బయటపెట్టిన సందేహాలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి రష్మిక కు అసలు డేటింగ్ అంటే ఏమిటో తెలియదు అని అంటోంది.
అంతేకాదు ఎవరితోనైనా డేటింగ్ కు వెళ్తే ఏం చేయాలో తనకు తెలియదు అంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. "రొటీన్ డేటింగ్స్ నాకు తెలియవు. అసలు డేటింగ్స్ కు వెళ్లి ఏం చేస్తారో కూడా నాకు అర్థంకాదు నావరకు నేనైతే డేటింగ్ కంటే ఎడ్వెంచరస్ స్పోర్ట్స్ కు వెళ్లడానికి ఇష్టపడతాను. ఇక వర్చువల్ డేటింగ్స్ అస్సలు ఇష్టం ఉండదు." అంటూ కామెంట్స్ వేసింది.
అయితే కొంత కాలం క్రితం రష్మిక ఒక క్రేజీ హీరోతో డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటిది ఈ బ్యూటీ ఇప్పుడు తనకు డేటింగ్ అంటే ఏమిటో తెలియదు అని అనడం చూసి ఈ కరోనా సెకండ్ వేవ్ సమయంలో బిగ్ జోక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ ఈ కరోనా టైమ్ లో తాను ఎక్కువగా ఇంట్లో ఉండటం వల్ల ముఖానికి మేకప్ వేయవలసిన అవసరం రాలేదని అందువల్ల తన ముఖంలో గ్లో పెరిగింది అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చింది.
అంతేకాదు ఈ ఎండాకాలంలో తన చర్మాన్ని కాపాడుకునేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయనని కేవలం మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ లోషన్ మాత్రమే వాడుతానని అంటూ ఈ మండే వేసవిలో ముఖంలో గ్లామర్ పెరగాలి అంటే ఏమిచేయాలో సలహాలు ఇచ్చింది. ఈమధ్య లేటెస్ట్ గా ఈమె తమిళ హీరో కార్తీ తో నటించిన మూవీ ఫెయిల్ కావడంతో కార్తి అభిమానులు ఆ ఫెయిల్యూర్ కు హీరోయిన్ రష్మిక కారణం అంటూ ఆమె ఫోటోలకు గుండు కొట్టించి సోషల్ మీడియాలో హడావిడి చేసిన విషయం ఆమె దృష్టి వరకు వచ్చి ఉండాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి