బాలకృష్ణ కు చారిత్రాత్మక పౌరాణిక జానపద సినిమాలలో నటించడం బాగా ఇష్టం. ఆ మక్కువతోనే ‘భైరవద్వీపం’ ‘ఆదిత్య 369’ 'పాండురంగడు' ‘శ్రీరామరాజ్యం’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు.


అయితే బాలకృష్ణ కు తెలంగాణ చరిత్ర సాయుధపోరాటం పై ఎంతో ఆశక్తి ఈ చరిత్ర గురించి ఎవరు చెప్పినా బాలకృష్ణ గంటలు కొద్ది అప్పటి విషయాలను తెలుసుకుంటాడట. అంతేకాదు తెలంగాణ సాయుధపోరాటం పై ఒక సినిమా చేయాలని బాలకృష్ణకు తీరని కోరిక అని టాక్. ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ దర్శకుడు చరణ్ లక్కాకుల కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ ను కలిసి తనకు దర్శకుడుగా ఒక అవకాశం ఇమ్మని అడిగాడట.




దీనితో బాలయ్య ఆ దర్శకుడుని ప్రోత్సహిస్తూ ‘తెలంగాణ సాయుధ పోరాటం’ పై ఒక కథను రెడీ పెట్టుకుని తన వద్దకు వస్తే తాను అవకాశం ఇస్తానని అప్పట్లో బాలయ్య ఈ దర్శకుడుకి మాట ఇచ్చాడట. దీనితో జోష్ లోకి వెళ్ళిపోయిన చరణ్ లక్కాకుల తెలంగాణ సాయుధపోరాటం పై విపరీతమైన పరిశోధన చేసి అనేక పుస్తకాలు చదివి ఆ వివరాలతో ఒక బలమైన స్క్రిప్ట్ ను రెడీ చేసి ఈ మధ్యనే బాలయ్యను కలిసాడట. ఈ స్క్రిప్ట్ బాలయ్యకు బాగా నచ్చడంతో ఈ మూవీలో నటించాలాని భావించినా ఇలాంటి భారీ సినిమాలను నిర్మించే నిర్మాతల కోసం బాలయ్య అన్వేషిస్తూ ఈ స్క్రిప్ట్ ను పెండింగ్ లో పెట్టాడట.


అంతేకాదు తాను ఎప్పుడు బాలకృష్ణను కలిసినా చాల అభిమానంగా మాట్లాడుతూ తనను ప్రోత్సహిస్తూ ఉంటాడని చరణ్ లక్కాకుల పొంగిపోతున్నాడు. అయితే గతంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేసిన 'పరమ వీరచక్ర' సినిమాలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్రలో బాలయ్య నటించాడు. ఆ సినిమా సూపర్ ఫ్లాప్ అలాంటి పరిస్థితులలో సెంటిమెంట్స్ ను బాగా నమ్ముకునే బాలకృష్ణ ఇప్పుడు ఈ సినిమాను ఎప్పుడు చేస్తాడో ఆయనకే తెలియాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: