సాధారణంగా ఎవరైనా సరే ఏదైనా ఉద్యోగం కానీ , ఏదైనా పని చేసేటప్పుడు కానీ, వారి పని సమయం ముగిసి పోగానే ఇంటికి వెళ్ళి పోతూ ఉంటారు. ఇక అలాంటివారు సినీ ఇండస్ట్రీలో  కూడా ఉంటారు . అందులో కొంతమంది అయితే సాయంత్రం 6  అయితే చాలు ప్యాకప్ చెప్పేస్తూ ఉంటారు అని కామెంట్ చేసిన దర్శకనిర్మాతలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. అయితే కొంతమంది నటులు మాత్రం ఏకంగా సినిమా కోసం తమ ప్రాణాలను పెట్టి మరీ పని చేస్తారు అని కూడా వారే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి క్యారెక్టర్ గురించి చాలెంజింగ్ రోల్ గురించి,  వారికి  చెప్తే, వారు ఏకంగా ఆ పాత్ర  కోసం వారి  ప్రాణాలను సైతం  అడ్డుపెట్టడానికి  కూడా  వెనుకాడరు అని కూడా సినీ ఇండస్ట్రీలోని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇక అలాంటి కోవకు చెందిన వాడే మన నటుడు శ్యామ్ కూడా..


శ్యామ్  ఎవరని ఆలోచిస్తున్నారా? అతను ఎవరో కాదు రేసుగుర్రం చిత్రంలో అల్లు అర్జున్ కి అన్న పాత్రలో నటించిన వ్యక్తి శ్యామ్.. తమిళ్ సినీ ఇండస్ట్రీలో బాబీ సింహ, విజయ్ సేతుపతి వంటివారి లాగానే నటుడు శ్యామ్ కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి ,అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో  తెరకెక్కిన చిత్రం "కిక్". ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు శ్యామ్. ఆ తరువాత కళ్యాణ్ రామ్ కత్తి, వీర ,ఊసరవెల్లి, యాక్షన్ 3డి ,రేసుగుర్రం, ఆక్సిజన్ వంటి పలు చిత్రాలలో నటించి ,తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..


ఇదిలా ఉండగా శ్యామ్ ఓ సినిమాలో ఒక పాత్ర కోసం ఒక ఛాలెంజింగ్ రోల్ కు ఎంపికయ్యాడు. ఈ పాత్ర ప్రకారం కళ్ళు చిన్నవిగా కనిపించాలి. వాటి కింద గడ్డలు ఉండాలి. అయితే దీనిని గ్రాఫిక్స్ లో  మేనేజ్ చేయవచ్చు. ఇక మేకప్ టీంకు చెప్తే, గంటలో అలాంటి లుక్ లోకి తీసుకెళ్ళి పోతారు. కానీ నాచురల్ గా ఉండాలని భావించిన శ్యామ్, ఏకంగా తొమ్మిది రోజులు నిద్ర మానుకొని, ఈ లుక్ లోకి వచ్చాడు. ఇక శ్యామ్ ను  చూస్తే  గుర్తుపట్టలేనంతగా  ఉండడమే కాకుండా భయపెట్టే విధంగా కూడా కనిపిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా ఒక వృత్తిపరంగా ఇంతటి డెడికేషన్ ఉన్న వ్యక్తికి తప్పకుండా హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.. ఈ పాత్ర తో నైనా సినిమా సక్సెస్ అవ్వాలని మనమందరం కోరుకుందాం...


మరింత సమాచారం తెలుసుకోండి: