దర్శకుడు సుకుమార్ చాల నెమ్మదిగా తీస్తాడు అన్న పేరుంది. అయితే అతడి క్రియేటివిటీ చాల అద్బుతంగా ఉంటుంది కాబట్టి టాప్ హీరోలు అంతా అతడి సినిమాలలో నటించడానికి ఆశక్తి కనపరుస్తూ ఉంటారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ ఆగష్టులో విడుదల కావలసి ఉంది.


గత సంవత్సరం డిసెంబర్ నుండి మార్చి నెలాఖరు వరకు ఈ మూవీ షూటింగ్ వేగంగా జరిగిన పరిస్థితులలో ఈమూవీ షూటింగ్ చాల వరకు పూర్తి అయి ఉంటుంది అని భావించారు. అయితే ఇప్పుడు అసలు వాస్తవం వేరు అని అంటున్నారు. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ షూటింగ్ ఇంకా చాల ఉంది అని అంటున్నారు. ఇప్పటివరకు ఈమూవీ షూటింగ్ చాలారోజులు జరిగినప్పటికీ ఈమూవీకి సంబంధించిన సీన్స్ ఇంకా చాల షూట్ చేయవలసి ఉందని ఆమధ్య విడుదల చేసిన ‘పుష్ప’ టీజర్ కు సంబంధించి కట్ చేసిన సీన్స్ కూడ చాల వెతుక్కోవలసి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు తారా స్థాయికి చేరుకోవడంతో తిరిగి మళ్ళీ పరిస్థితులు సద్దుమణిగి షూటింగ్ లు ప్రారంభించడానికి మరో మూడు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. దీనితో ఈమూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన సుకుమార్ కు రావడంతో దీనికి సంబంధించిన లీకులు పరోక్షంగా ప్రచారంలోకి తీసుకు వచ్చారు అని తెలుస్తోంది.


మొదట్లో ఈమూవీని రెండు భాగాలుగా విడుదల చేయడానికి ఆశక్తి కనపరిచిన బన్నీ సుకుమార్ సూచనకు ఓకె చెప్పాడని అయితే ఈవిషయంలో సుకుమార్ కు భిన్నాభిప్రాయాలు ఉండటంతో ఇప్పటికీ ఒక స్థిర నిర్ణయానికి రాలేకపోతున్నాడు అని టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ రెండు పార్టులుగా విభజించినా మొదటి పార్ట్ విడుదల అవ్వడానికి డిసెంబర్ వచ్చేస్తుంది అని అంటున్నారు. దీనితో ఈవిషయమై బన్నీ సుకుమార్ ల మధ్య అనేక చర్చలు జరుగుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: