సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులందరినీ ఆకర్షించి వరుస అవకాశాలను దక్కించుకుంటారు.  అయితే సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక సినిమాల ఎంపిక విషయంలో తొందర పడుతూ ఉంటారూ. కానీ నేను మాత్రం అస్సలు అలా చేయను అంటుంది జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఇటీవలే ఓ చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.




 విడుదలైన కొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను సైతం దాటేసింది ఈ సినిమా. అయితే జాతి రత్నాలు సినిమా పేరు ఎత్తగానే అందరి ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరుస్థాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన హైదరాబాద్ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా  మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి తెలుగు చిత్ర పరిశ్రమలో అదృష్టం బాగా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా అవకాశాలు వచ్చి చెంత వాలి పోతున్నాయి. అయితే వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ కథల ఎంపికలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.




 మొదటి సినిమా తోనే తన అందం అభినయం తో పాటు నటనతో కూడా మంచి మార్కులు కొట్టేసింది ఫరియా అబ్దుల్లా.  జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ విజయం కావడంతో టాలీవుడ్ డైరెక్టర్ల అందరి చూపు ని ఆకర్షించిన ఈ అమ్మడుకి అవకాశాలు క్యూ కడుతున్నప్పటికీ కథల ఎంపికలో మాత్రం ఎంతో స్లోగానే ముందుకు కదులుతుంది  ఎ ఎలాంటి కథలు ఎంచుకుంటే తన కెరియర్ కి ఉపయోగ పడుతుంది అనే విషయంలో ప్రస్తుతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇక త్వరలో తన ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: