హీరోలు తమ సినిమాల పాటల్లో ఇంటిపేరు వాడితే.. ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. చాలామంది హీరోల ఇంటిపేర్లు సినిమా పాటల్లో వచ్చి ఫ్యాన్స్ ని బాగా ఖుషి చేసాయి. ఐతే ఈ ఆర్టికల్ లో హీరోల ఇంటిపేర్లతో రూపొంది సూపర్ హిట్ అయిన 5 సాంగ్స్ గురించి తెలుసుకుందాం.


1. సమరసింహ రెడ్డి(1999) సినిమాలో "నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా" పాటలో బాలకృష్ణ ఇంటిపేరు "నందమూరి" వాడారు. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం, కె.ఎస్ చిత్ర ఆలపించారు. భువన్ చంద్ర సాహిత్యం అందించారు. ఎన్టీఆర్ ఇంటిపేరుతో వచ్చిన ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ సాంబ(2004) సినిమాలోని నందమూరి చందమామ పాటలో "నందమూరి" ఇంటిపేరు వాడారు.



2. నిర్ణయం(1991) సినిమాలో "హలో గురు ప్రేమ కోసమే" పాటలో.. "గొప్ప ఇంటి కుఱ్ఱవాడ్ని అక్కినేని అంతటోడ్ని" అనే లైన్ ఉంటుంది. ఇందులో నాగార్జున ఇంటి పేరు "అక్కినేని" వాడారు. ఇళయరాజా కంపోజ్ చేసిన ఈ పాటకు గణేష్ పాట్రో సాహిత్యం అందించగా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం అద్భుతంగా ఆలపించారు. ఈ పాట టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిపోయింది. ఈ పాటలో నాగార్జున అమల వెంట పడుతూ ప్రేమించమని కోరుతుంటారు.



3. ఆర్య(2004) సినిమాలో వేటూరి సుందరరామమూర్తి రచించిన.. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన "అ అంటే అమలాపురం" పాటలో "హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ" అనే లైన్ ఉంటుంది. అల్లు అర్జున్ ఇంటి పేరు "అల్లు" తో వచ్చిన ఈ పాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ డూపర్ హిట్టయ్యింది. అ అంటే అమలాపురం పాట ఒక ఎవర్ గ్రీన్ హిట్ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ పాట ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వంటి కొన్ని ప్రాంతాల్లో కూడా దుమ్ము రేపింది. ఈ పాట ఎంతగా పాపులర్ అయిందంటే.. మాక్సిమం(2012) అనే హిందీ సినిమాలో కూడా ఈ పాటని రీమేక్ చేశారు.



4. రచ్చ(2012) సినిమాలో టిప్పు, గీతామాధురి ఆలపించిన డిల్లకు డిల్లకు డిల్లా పాటలో "కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతంటి దుడుకా" అని వస్తుంది. ఈ పాటలో రామ్ చరణ్ ఇంటిపేరు వాడారు.



5. అఖిల్(2015) సినిమాలోని "అక్కినేని అక్కినేని" పాటలో అఖిల్ ఇంటి పేరు వాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: