తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ప్రస్తుతం తమదైన శైలిలో రాణిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చిన్న హీరోయిన్లు పెద్ద హీరోయిన్లు అనే తేడా లేకుండా ఓవైపు సినిమాలతో మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో మందిని అలరిస్తూ అభిమానులను సంపాదించుకుంటూ దూసుకుపోతున్నారు.  తెలుగు చిత్ర పరిశ్రమలో తన అందం అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తెలుగమ్మాయి ధన్య బాలకృష్ణ.  ఇక స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తక్కువే అయినప్పటికీ చిన్న హీరోల సినిమాల్లో అవకాశాలు మాత్రం అందుకు దూసుకుపోతుంది ఈ అమ్మడు.



 ఇక ప్రతి సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.  సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ పాత్రకు తగ్గట్లుగా నటించాల్సి ఉంటుంది. దీని కోసం మందు తాగుతున్నట్లుగా లేదా సిగరెట్ తాగుతున్నట్లుగా నటించాల్సిన సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి  అయితే తమ అభిమాన హీరో హీరోయిన్లనూ ఇలా మందు తాగడం లేదా సిగరెట్ తాగుతున్న సన్నివేశాల్లో చూసి కొన్ని కొన్ని సార్లు అభిమానులు ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటారు. ఇక ఇటీవల ధన్య బాలకృష్ణ కూడా ఇలాంటి ఒక సన్నివేశంలో నటించింది.




 ధన్య బాలకృష్ణ రాజా రాణి అనే సినిమాల్లో నటించింది. అయితే ఇక ఈ సినిమాలో తన నటనతో ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో మందు తాగుతున్నట్లు నటించింది ధన్య బాలకృష్ణ.  ఇకపోతే ఇక ఈ సన్నివేశం పై ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్. రాజా రాణి సినిమా లో నిజంగానే మద్యం తాగారా అంటూ ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ఆ సన్నివేశంలో మద్యం తాగే లేదని.. కేవలం మంచి నీళ్లు మాత్రమే తాగుతు నటించాను అంటూ చెప్పుకొచ్చింది. తనకు పార్టీలు చేసుకోవడం కూడా ఎక్కువగా ఇష్టముండదు అంటూ తెలిపిన ఈ అమ్మడు.. స్నేహితులతో లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం మాత్రం ఇష్టం అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: