మెగా ఫ్యామిలీ వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన " చిరుత"  చిత్రం ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు తోపాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అలాగే  నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత 2010లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్, 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, 2013లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో నాయక్, జంజీర్ హిందీ రీమేక్ చిత్రం తుఫాన్, 2014లో పైడిపల్లి వంశీ  దర్శకత్వంలో ఎవడు, 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలలో నటించాడు. ఇక వరుస  ఫ్లాపులతో రామ్ చరణ్ కొట్టుమిట్టాడు. ఫ్లాపులతో నీరసించిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే ఆలోచనతో అప్పటివరకు  విభేదాల్లో మునిగిపోయి ఉన్న శ్రీను వైట్ల, కోన వెంకట్ , గోపి మోహన్ ఈ ముగ్గురిని కలిపి 2015లో బ్రూస్ లీ  చిత్రాన్ని తెరకెక్కించారు. 2015 అక్టోబరు 16 శుక్రవారం నాడు భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. రాం చరణ్ , రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.


ఇక ఈ సినిమా కథలో ఎలాంటి పస లేకపోవడంతో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక ఈ సినిమాకి భారీ బిజినెస్ కావడానికి మెగాస్టార్ చిరంజీవి మెగా క్యామియో  కూడా కారణం చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా ఈ చిత్రాన్ని విజయవంతం చేయడానికి చివర్లో మెగాస్టార్ చిరంజీవిని తీసుకురావడం కూడా జరిగింది. అయితే సినిమా స్టోరీ లో మాత్రం ఎలాంటి పస లేకపోవడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది అయితే ఈ సినిమాకు రూ.50కోట్ల బడ్జెట్ పెట్టగా, ఇక రూ.65 కోట్లకు అమ్మారు. ఇక వచ్చిన కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కేవలం రూ.40 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఇక మొత్తం 25 కోట్ల రూపాయలు లాస్ తో డిజాస్టర్ గా నిలిచింది ఈ చిత్రం.. రామ్ చరణ్ ఎంతో ఆశ పడి , చివరికి డిజాస్టర్ ను చవిచూశాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: