బి ఎ సుబ్బారావు డైరెక్షన్ లో తెరకెక్కిన పల్లెటూరి పిల్ల అనే సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సమయంలో ఓ ఫైట్ సీన్ లో లో ఎన్టీఆర్ కి గాయం అయింది.. ఎన్టీఆర్ ను ఓ దున్నపోతు ఎత్తి కుదేసింది.. దర్శకుడు బి.ఎ.సుబ్బారావు డూప్ తో చేద్దామని ఎంత చెప్పిన ఎన్టీఆర్ వినకుండా తనే ఫైట్ చేస్తానని వెళ్లగా దున్నపోతు వల్ల ఎన్టీఆర్ కుడిచేతికి గాయం కావడంతో పాటు స్పృహ కూడా తప్పాడు..
ఆ సమయంలో సెట్ లో ఉన్న వాళ్లు డాక్టర్ కోసం కబురు పెట్టగా ఓ వ్యక్తి సెట్ కు వచ్చి తాను పుత్తూరు వైద్యుడినని పరిచయం చేసుకుని సీనియర్ ఎన్టీఆర్ కు కట్టు కట్టి రెట్టింపు డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. అయితే ఎన్టీఆర్ కు తనకు తెలిసి తెలియని వైద్యం చేసి నందుకు ఏమాత్రం నొప్పి తగ్గకపోవడం తో పాటు చేయి కూడా బరువెక్కినదట.. ఆ తర్వాత మరో వైద్యుడిని పిలిపించి చూపించగా ఆ వైద్యుడు ఎన్టీఆర్ చెయ్యి నీ చూసి మొదట వైద్యం చేసిన వ్యక్తి నకిలీ వైద్యుదు అని చెప్పి ఆ చెయ్యి సాధారణ స్థితికి తీసుకు వచ్చాడు.. అలా ఓ వైద్యులు చేతిలో మోసపోయారు ఎన్టీఆర్.. డూప్ పెట్టి చేద్దామన్న దర్శకుడి మాట వినకుండా చేసి తాను ఎంత మొండి వాడి నో అని చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి