నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి తీస్తున్న అఖండ సినిమాపై ఆయన అభిమానులతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. బాలయ్యమూవీ లో డ్యూయల్ రోల్ పోషిస్తుండగా ఆయనకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. కాగా ఈ మూవీలో బాలయ్య ఒక మధ్య తరగతి రైతుగా అలానే అఘోరా గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు పాత్రల తాలూకు ఫస్ట్ లుక్ టీజర్స్ రెండూ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా ఈ నెల 28న విడుదల కావలసి ఉండగా ప్రస్తుతం కరోనా ఉధృతి కారణంగా ఈ మూవీని వాయిదా వేసినట్టు సమాచారం అందుతోంది. మరోవైపు ఈ మూవీకి భారీ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అలాగే అతి త్వరలో తాజా రిలీజ్ డేట్ ని యూనిట్ అనౌన్స్ చేయనుంది అని అంటున్నారు. ఇక ఈ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక భారీ సినిమా చేయనున్నారు.

ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో భారీ రేంజ్ లో నిర్మితం కానున్న ఈ సినిమాకి టార్చ్ బేరర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. బాలయ్య ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తుండగా కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు గోపీచంద్ ఈ మూవీ స్టోరీ స్క్రిప్ట్ ని ఎంతో అద్భుతంగా సిద్ధం చేసినట్లు సమాచారం. వాస్తవానికి బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న అఖండ మూవీకి మొదట ఈ టైటిల్ పరిశీలించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ విధంగా ఆ మూవీ కోసం అనుకున్న టైటిల్ ని ఈ మూవీ కి సెట్ చేసారని అంటున్నారు. మరి ప్రస్తుతం పరిచయం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారికంగా న్యూస్ విడుదలయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: