గత సంవత్సరం, అలాగే ప్రస్తుతం కరోనా సమయంలో అనేక వేల మందికి నేరుగా.. అలాగే కొన్ని లక్షల మందికి పరోక్షంగా ఆపద్బాంధవుడుగా మారిన వ్యక్తి సోనుసూద్. వెండితెరపై విలన్ పాత్రలు పోషించిన నిజ జీవితంలో మాత్రం ఎవరు చేయలేని ఎన్నో పనులను తానై ముందుకు సాగుతూ నిజమైన హీరోగా పేరు తెచ్చుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనుసూద్. తాజాగా ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఇందుకు అసలు కారణం వారు భారీ మొత్తంలో మందులు కొనుగోలు చేయడమే.


ప్రస్తుతం కరోనా కారణంగా అనేక మంది సెలబ్రెటీలు పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు సినీతారలు, అలాగే రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా మందులు పంపిణీ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ముంబై హైకోర్టు విచారణ చేపట్టి ఆ మందులు పంపిణీ చేయడానికి వారికి ఆ మందులు ఎక్కడినుంచి వచ్చాయో వాటి వివరాలను వివరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ముంబై హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే కోవిడ్ డ్రగ్స్ పై అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నట్లు హైకోర్టు తెలియజేసింది. ప్రజలందరికీ మంచి చేయాలన్న ఆలోచన చాలా మంచిది.. కాకపోతే, కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉన్న ఈ కోవిడ్ డ్రగ్స్ వారికి ఎక్కడి నుంచి లభిస్తున్నాయో తెలుసుకోవాలని కోర్టు తెలిపింది.


డ్రగ్స్ సెలబ్రిటీలకు ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ నుంచి లభిస్తోందా..? లేకపోతే ఏదైనా అనధికారంగా మందులు కంపెనీలు సప్లై చేస్తున్న లాంటి విషయాలను విచారణ జరిపి పూర్తి వివరాలను అందజేయాలని ముంబై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ సమస్యపై మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ సిద్ధికి, అలాగే నటుడు సోనుసూద్ చారిటీకి ఇంకా ఇతర వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇకపోతే ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి మందులను కొందరు ఉత్పత్తి కేంద్రాల నుంచి కొనుగోలు చేస్తుండగా.. మరికొందరు కేవలం డబ్బును మాత్రమే డొనేట్ చేస్తున్నట్లు కోర్టుకు న్యాయవాదులు తెలియజేశారు. అయితే ఇవన్నీ ఇలా ఉన్నా కానీ మందులు వారి దగ్గరికి ఎలా వచ్చాయన్న విషయాన్ని కోర్టుకు తెలపాలని కోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: