రానా ప్రధాన పాత్రలో సురేష్ బాబు సమర్పణలో తెరకెక్కాల్సిన ఈ చిత్రానికి కరోనా కారణంగా బ్రేక్ పడింది. దాంతో శాకుంతలం సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కాస్త తగ్గగానే మిగిలింది కూడా శరవేగంగా పూర్తి చేస్తామంటున్నారు. శాకుంతలం సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ చిత్రం తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న విషయానికి వస్తే, ‘రుద్రమదేవి’ పోస్ట్ ప్రొడక్షన్స్ సమయంలోనే ప్రతాపరుద్రుడు కథని పూర్తి చేసేశారట దర్శకుడు గుణశేఖర్. రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడు , ఆయన సాహస పోరాటాలపై సినిమా తీసేందుకు ఎంతో ఆసక్తి ఉన్న డైరెక్టర్ గుణకు రుద్రమదేవి ఫ్లాప్ అవడంతో ఈ సినిమాపై సందేహాలు కలుగుతున్నాయి.
అయితే ఇన్నాళ్లకు ఈ సినిమాను పూర్తి చేసే టైం వచ్చింది అంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రతాపరుద్రుడు స్క్రిప్ట్ కు అన్ని హంగులను చేర్చి కంప్లీట్ చేసారట. అయితే హిరణ్యకశ్యప తర్వాతనే ఈ సినిమాను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హిరణ్యకశ్యప సినిమా విషయానికి వస్తే ఇదో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. బడ్జెట్ పరంగా కూడా భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి కరోనా శాంతించి ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతులిచ్చినా ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ అర్జు గుణశేఖర్ తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. హ్యాపీ బర్త్ డే గుణశేఖర్ గారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి