గత ఏడాది కరోనా కారణంగా ఎస్పీబీ చనిపోయారు అనేది అందరూ అనుకుంటున్న విషయం. అయితే కరోనా వచ్చినంత మాత్రాన చనిపోయాడా అంటూ చాలా మంది ఆలోచనలో పడిపోయారు. ఎందుకంటే పాజిటివ్ వచ్చినా కూడా కంగారు పడకుండా ఇంట్లోనే రెండు వారాల సమయం తీసుకొని అన్ని రకాల మందులు వాడి పోషకాహారం తీసుకుని కరోనా నీ నయం చేసుకుంటున్నారు. రికవరీ రేటు కూడా 80 శాతానికి పైగానే ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్లి నయం చేసుకుంటున్నారు. అందులో కూడా కొందరి పరిస్థితి మాత్రమే విషమిస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కు కరోనా వచ్చినట్లు గానీ, హాస్పిటల్ మెట్లు ఎక్కినట్లు కానీ ఆరోగ్యం దెబ్బ తిన్నట్లు కానీ ఎక్కడ వార్తలు రాలేదు. కరోనా తో నెల రోజులు పోరాడి గెలిచాడు బాలు. నెగటివ్ వచ్చిన తర్వాతనే బాలసుబ్రహ్మణ్యం మరణించాడు. దాదాపు నలభై నాలుగు రోజులు చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ పైనే ఉన్నాడు. ఆయన మరణించడానికి ప్రధాన కారణం బేరియాట్రిక్ సర్జరీ. బరువు తగ్గడం కోసం చేసే ఈ ఆపరేషన్ వల్ల ఆయన చనిపోయారు అని ఆయన సన్నిహితులు చెపుతున్న మాట. సర్జరీ చేయించుకున్న తర్వాత బాలు ఒంట్లో కొన్ని అవయవాలు బలహీనపడ్డాయి అని దాంతో కరుణ వైరస్ అటాక్ చేసేసరికి అది కాస్త విషమించి మరణించారని డాక్టర్లు చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి