ఈ మూవీకి "పవర్ పేట" అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. భారీ బడ్జెట్ తో కూడుకున్న ఈ సినిమాని రెండు పార్ట్ లుగా తెరకెక్కించాలని భావించారు. అయితే హఠాత్తుగా ఈ సినిమాని హీరో నితిన్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రెండు కారణాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొదటిది ఏంటంటే పవర్ పేట సినిమా కథ శర్వానంద్ నటిస్తున్న మహాసముద్రం సినిమా కథకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయట, దాంతో కాపీ అనిపించే చాన్స్ ఉండడంతో ఈ సినిమాకి పెద్దగా ఆదరణ లభించకపోవచ్చన భావించి పవర్ పేట సినిమాని స్వయంగా నితినే పరస్పర అనుసంధానంతో కాన్సిల్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక రెండో వైపు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కరోనా సమయంలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసి విడుదల చేయడం ఒక ప్రయోగమే అవుతుంది.
పైగా ప్రస్తుతం వైరస్ కారణంగా పరిస్థితులను అంచనా వేయలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో భారీ ప్రాజెక్ట్ అందులోనూ రెండు పార్ట్ లు అంటే నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని పలువురు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ కారణాల చేత డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ ప్రాజెక్ట్ విషయంలో బ్యాక్ స్టెప్ వేసినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే హీరో నితిన్ లేదా దర్శకుడు కృష్ణ చైతన్య అధికారిక ప్రకటన చేస్తే తప్ప క్లారిటీ రాదు. ఈ విధంగా నితిన్ సినిమా అగిపవడానికి శర్వానంద్ కారణమయ్యాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి