నిఖిల్ కూడా గతేడాది లాక్ డౌన్ టైమ్‌లోనే పెండ్లి పీఠలెక్కాడు. డాక్టర్ పల్లవిని ప్రేమించి మరీ పెళ్లాడి లైఫ్ లో సెటిలయ్యాడు ఈ హీరో. ఆ సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మొదట నిఖిల్ ఆమెను ప్రేమించి, ఆ తర్వాత ఇరు పెద్దల్ని ఒప్పించి మరీ అందరి ఇష్టంతో ప్రేమవివాహం చేసుకున్నాడు ఈ హీరో. అయితే ఈ హృరో కాస్త సైలెంట్ గా ఉండటంతో ఈయన గురించి తెలిసింది చాలా తక్కువ మందికే అని టాక్.
అయితే ఈ యంగ్ హీరో నిఖిల్ లవ్, లైఫ్, ఇతర విషయాల గురించి ఇండస్ట్రీలో తొలిసారిగా ఎవరికి తెలుసు అంటే వీటికి ఇప్పుడు జవాబు దొరికింది. నిఖిల్ ఎక్కువగా తన పర్సనల్ విషయాలను తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అల్లు శిరీష్ తో మాత్రమే తొలిసారిగా షేర్ చేసుకున్నాడని టాక్? ఇప్పటికే నిఖిల్ ఓ ఇంటివాడై ఏడాది దాటుంతుండగా ఈ విషయంపై ఇప్పుడు చర్చ సాగుతోంది.
ఇక నిఖిల్ తను ప్రేమించిన పల్లవితో డేటింగ్ చేస్తున్న సమయంలో ఆ మేటర్ కేవలం అల్లు శిరీష్ దగ్గర మాత్రమే ఓపెనయ్యారట. ఆ సంగతి ఇంకెవరికీ తెలియదంట. ఈ సీక్రెట్‌ను నిఖిల్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తెలుపుతూ శిరీష్ ట్వీట్ చేయడం చర్చనీయాంశం. నిజానికి నిఖిల్ కు గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో అవకాశం వచ్చేలా చేసింది శిరీష్ అనే గాసిప్ ఎప్పటినుంచో ఉండటంతో వీరి కాంబో గురించి మంచి క్రేజ్ ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి