ఎప్పుడు ప్రజల ఆదరణతో కోలాహలంగా సాగిపోయే ఈ నాటక బృందాలు ప్రదర్శనలు ప్రస్తుతం మూగబోతున్నాయి. 136 ఏళ్ల చరిత్ర ఉన్న సురభి నాటక బృందాలు ప్రస్తుతం అతలాకుతలం అవుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం సురభి నాటక బృందాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. ప్రస్తుతం రోజు రోజుకి సినిమాలకు ఆదరణ పెరిగిపోతు ఉండటం.. అదే సమయంలో సురభి నాటక బృందాల ప్రదర్శనను తిలకించేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఇక వారికి ఉపాధి కరువవుతుంది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి రావడం తో పూర్తిగా ఉన్న ఉపాధి కూడా కరువై పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులందరినీ తమ ప్రదర్శనలతో రంజింపజేసిన ఎన్నో సురభి నాటక బృందాలు ప్రస్తుతం మూగ పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తంగా 50 కి పైగా ఉన్న సురభి నాటక బృందాలు గత కొన్నేళ్ల నుంచి ఒక దాని తర్వాత ఒకటి మూత పడుతూనే ఉన్నాయ్. ఇక ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఆసాంతం నాటక బృందాలు దెబ్బతిన్నాయి. అయితే సురభి కళనే నమ్ముకుని బతుకుతున్న తమకు ప్రస్తుత ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని.. ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ సురభి నాటక బృందం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకుంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి