బాలయ్య నటిస్తున్న అఖండ మూవీ నుండి ఇప్పటికే బయటకు వచ్చిన రెండు టీజర్స్ కూడా ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. యువ ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యొక్క మిగిలిన భాగాన్ని ఈ కరోనా పరిస్థితులు చక్కబడిన అనంతరం చిత్రీకరించి వీలైనంత త్వరగా మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

మంచి యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు బోయపాటి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, ముఖ్యంగా సినిమాలో బాలయ్య పోషిస్తున్న అఘోరా పాత్ర తో పాటు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్, అలానే సెకండ్ హాఫ్ లో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్, అలానే క్లైమాక్స్ ఎపిసోడ్ వంటివి అదిరిపోనున్నాయట. ఇక ముఖ్యంగా థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్లస్ కానున్నట్లు సమాచారం.

మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే సింహా, లెజెండ్ తరువాత ముచ్చటగా మూడవసారి బాలయ్య, బోయపాటి ల కాంబో లో వస్తున్న ఈ అఖండ మూవీ పక్కాగా అఖండ విజయం అందుకోవడం ఖాయం అని, అయితే ఇది రిలీజ్ తరువాత ఏ స్థాయిలో కలెక్షన్స్ దక్కించుకుంటుంది అనేది మాత్రమే మిగిలి ఉందని అంటున్నాయి పలు టాలీవుడ్ వర్గాలు. మరోవైపు రేపు బాలయ్య జన్మదినం సందర్భంగా ఈ మూవీ నుండి నేడు బాలయ్య అదిరిపోయే లేటెస్ట్ లుక్ విడుదల చేసింది యూనిట్. మొత్తంగా అఖండ మూవీ పై అందరిలో రోజు రోజుకు అంచనాలు తారా స్థాయి కి చేరుతున్నాయి అనే చెప్పాలి .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: