తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడు కావాలనే కలతో వచ్చి చివరికి హీరోగా మారిపోయి తన నాచురల్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని వరుస విజయాలను సాధిస్తూ తెలుగు ప్రేక్షకుల నాచురల్ స్టార్ గా మారిపోయాడు నాని.  ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. కెరియర్ మొదట్లో వరుస విజయాలను సాధిస్తూ ఓటమి లేని హీరోగా దూసుకుపోయిన నాని.. గత కొన్ని సినిమాల నుండి మాత్రం సరైన విజయాన్ని అందుకోలేక పోతున్నాడు.  పలు వైవిధ్యమైన కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎందుకొ ఆకట్టుకోలేక పోతున్నాడు.



 ఇక గత కొన్నాళ్ల నుంచి నాని కి సరైన విజయం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే నాచురల్ స్టార్ నాని గతంలో కృష్ణార్జున యుద్ధం పేరుతో రొటీన్గా కాకుండా కాస్త భిన్నంగా ట్రై చేసాడు. కెరియర్లోనే మొదటిసారి డబుల్ రోల్ లో నటించాడు.  ఇక ఈ సినిమా పై ఎన్నో అంచనాలు కూడా నెలకొన్నాయి   కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా అంచనాలను అందుకోలేక బొక్క బోర్లా పడి పోయింది.  నాని కెరియర్లోనే డిజాస్టర్గా మిగిలిపోయింది కృష్ణార్జున యుద్ధం సినిమా.  దీంతో అప్పటి నుంచి నాని లో భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే ఇలాంటి విభిన్నమైన సినిమాల జోలికి మళ్లీ పోవద్దు అని నాని అనుకుంటున్నాడట. ఇటీవలే వివి వినాయక్ లాంటి ఒక స్టార్ దర్శకుడు ఒక మంచి కథను నాని కి వినిపించాడట.  అయితే కథ బాగా ఉన్నప్పటికీ స్టోరీ రొటీన్ కి భిన్నంగా ఉండటంతో ఇక నాని కృష్ణార్జున యుద్ధం టైం ని గుర్తు చేసుకొని స్మూత్ గా  కథకి నో చెప్పాడట.  ఇక ఈ సినిమా చేసేందుకు అటు నిర్మాతలు సైతం సిద్ధం అయినప్పటికీ నాని మాత్రం నో చెప్పినట్లు తెలుస్తోంది.  ఏదేమైనా కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ ఎఫెక్ట్ మాత్రం ఇప్పటికీ నాని పై నుండి పోవటం లేదట. దీంతో వైవిధ్యమైన కథల విషయంలో నాని ఇప్పటికీ భయపడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: