నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యక్షన్ సినిమా లక్ష్మి నరసింహా. 2004 సంక్రాంతికి మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎంతో భారీగా నిర్మించిన ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ అధికారి లక్ష్మి నరసింహా పాత్రలో బాలయ్య టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకాభిమానుల నుండి మంచి పేరు దక్కింది. అప్పట్లో ఈ సినిమా చాలా ఏరియాల్లో పలు రికార్డులను నెలకొల్పింది.
ఇక ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య పలికే పవర్ఫుల్ డైలాగ్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ విపరీతంగా ఈలలతో హోరెత్తించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో ఆసిన్ కథానాయికగా నటించగా ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర చేసారు. అంతకముందు తమిళ్ లో విక్రమ్ హీరోగా తెరకెక్కిన సామి సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ. కథ పరంగా చూస్తే తన తండ్రిని, అలానే కొందరు ఊరి ప్రజలను హతమార్చిన ధర్మభిక్షం అనే రౌడీ ని అంతమొందించడానికి అతడి నివాస ప్రాంతమైన విజయవాడకు విచ్చేసిన పోలీస్ అధికారి లక్ష్మినరసింహా, ఏ విధంగా తన తెలివితేటలు, సాహసంతో అతడిని మట్టుబెట్టాడు అనేది ఓవరాల్ కథ.
ఇక ఈ సినిమాని బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు జయంత్ ఎంతో అద్భుతంగా తీశారు. అయితే ఈ సినిమా విడుదల తరువాత నిర్మాత బెల్లంకొండ సురేష్ పై హీరో బాలకృష్ణ కాల్పులు జరిపిన కేసు అప్పట్లో సంచలనంగా మారింది. మొత్తంగా బాలకృష్ణ పోలీస్ అధికారిగా నటించిన ఈ లక్ష్మినరసింహా మూవీ ఆయన కెరీర్ లోని బెస్ట్ కాప్ సినిమాల్లో ఒకటి అని చెప్పకతప్పదు ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: