కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్ లో మంచి స్టార్ హీరోగా దూసుకుపోతూ తెలుగులో కూడా మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు.విశాల్ ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా పరభాష హీరోగా చూడరు. అంతలా తెలుగులో క్రేజ్ ని సంపాదించుకున్నాడు.అయితే విశాల్ తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందడానికి కారణం ఒకే ఒక్క సినిమా అని చెప్పాలి. ఇక ఆ సినిమాతో విశాల్ తెలుగులో స్టార్ హీరోగా పాతుకుపోయాడు.ఇక విశాల్ కి టాలీవుడ్ లో ఇంతలా మార్కెట్ ని తెచ్చిపెట్టిన ఆ సినిమా 'పందెం కోడి'.


ఇక ఈ సినిమా 2005 సంవత్సరంలో డిసెంబరు 16న విడుదలైంది. ఇక ఈ చిత్రాన్ని జీకె ఫిల్మ్స్ కార్పోరేషన్ పతాకంపై విక్రమ్ కృష్ణ నిర్మించాడు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో విశాల్ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది.సీనియర్ స్టార్ హీరో రాజ్ కిరణ్ ముఖ్య పాత్ర పోషించాడు.ఇక లాల్, సుమన్ షెట్టి తదితరులు నటించారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందించాడు.


పూర్తిగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమా విశాల్ ని పెద్ద స్టార్ హీరోని చేసింది.ఈ సినిమా కథ అంతా కూడా కేవలం ఒక ఇన్సిడెంట్ తో ముందుకు సాగుతుంది.పలు యాక్షన్ అంశాలతో ఈ సినిమాని లింగస్వామి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు.ఒక పక్క విశాల్, మీరా జాస్మిన్ ల మధ్య లవ్ సీన్ లను సింపుల్ గా అందంగా చూపించి అలాగే విశాల్ లో యాక్షన్ యాంగిల్ ని బయటపెట్టిన తీరు ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది.ముఖ్యంగా హీరో రౌడీతో బస్సులో చేసిన ఫైట్ అలాగే పొలంలో ఫైట్ అయితే హైలెట్స్ అనే చెప్పాలి. ఇక యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ అయితే సినిమాకే పెద్ద ప్లస్ పాయింట్. తెలుగు తమిళ ప్రేక్షకులు ఇద్దరు కూడా ఈ సినిమా పాటలని నేపధ్య సంగీతాన్ని బాగా ఎంజాయ్ చేసేలా యువన్ కంపోజ్ చేసాడు.ఇక తమిళ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలీదు కాని తెలుగులో మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. విశాల్ నాచురల్ నటనకి తెలుగు ఆడియన్స్ బాగా ఫిదా అయ్యి ఈ చిత్రానికి బ్రహ్మ రథం పట్టారు.


ప్రతి హీరోకి తన కెరీర్ లో స్టార్ గా నిలబెట్టే సినిమా ఒకటి ఉంటుంది. ఇక విశాల్ కి ఈ సినిమా అనే చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమాకి ముందు విశాల్ పై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు అన్నిటికి ఈ సినిమాతో చెక్ పెట్టాడు.ఈ సినిమా విశాల్ ని పెద్ద కమర్షియల్ హీరోని చేసింది. ఇక ఈ సినిమా విశాల్ కి కేవలం హిట్ ని మాత్రమే కాదు తనని తెలుగు నాట పెద్ద యాక్షన్ హీరోగా చేసింది ఈ సినిమా.ఇక సినిమా అప్పట్లోనే 200 రోజులు ఆడి 2005 వ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 30 కోట్ల వసూళ్లు కోళ్ల గొట్టి సెన్సేషనల్ హిట్ అయ్యి విశాల్ దమ్మేంటో చూపించింది.ఇప్పటికి ఈ సినిమా టీవిల్లో వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: