హీరో ఆది తన కెరీర్ మొద‌ట్లో మంచి విజ‌యాలు అందుకుని జోరు మీద ఉండేవాడు. అయితే ఆయ‌న త‌న వైవిధ్య‌మైన మూవీలు, విల‌క్ష‌ణ‌మైన కేరెక్ట‌ర్ల‌తో మెప్పిస్తూ క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు క్రియేట్ చేసుకున్నాడు ఆది సాయికుమార్. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా నాటకం అనే మూవీని తెరకెక్కించిన క‌ళ్యాణ్ జీ గోగ‌ణ డైరెక్ష‌న్‌లో మ‌రో కొత్త మూవీ స్టార్ట్ అవుతోంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన నాగం తిరుపతి రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక మైన కేరెక్ట‌ర్ చేస్తున్నాడు.

కాగా ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి వివరిస్తూ విజన్ సినిమాస్ పతాకంపై ఆది హీరోగా సినిమా చేయ‌డం త‌న‌కు సంతోషంగా ఉంద‌ని తెలిపాడు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ చెప్పిన స్టోరీ వారికి న‌చ్చింద‌న్నాడు. ఆది మ‌రో కొత్త డైమ‌న్ష‌న్‌లో ప్రెజంట్ చేసే మూవీ అని చెప్పాడు. ఇక హీరో సునీల్ త‌మ మూవీలో ఓ కీ రోల్‌లో క‌నిపించ‌బోతున్నార‌న్నారు.  

ఈ పాత్ర‌కు సునీల్ అయితేనే బావుంటుంద‌ని ఆయ‌న్ని కల‌వ‌గా ఆయ‌న న‌టించ‌డానికి ఒప్పుకున్నార‌ని, ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్ అంటూ వివ‌రించాడు. ఈ మూవీని త‌మ బ్యాన‌ర్‌పై ప్రెస్టీజియ‌స్‌గా నిర్మిస్తున్న‌ట్టు నిర్మాత వివ‌రించాడు. ఎన్నో మూవీల‌కు స‌క్సెస్‌ఫుల్ మ్యూజిక్‌ను అందించిన సాయికార్తీక్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. దాంతోపాటే బాల్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ మూవీకి మ‌ణికాంత్ ఎడిటర్ గా చేస్తున్నాడు.  

ఇక త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించ‌బోయే ఈ మూవీకి సంబంధించిన మ‌రికొన్ని వివ‌రాలు న‌మోదు చేసి తెలియ‌జేస్తామ‌న్నారు. ఆది కొత్త లుక్‌లో ఈ మూవీలో క‌నిపిస్తాడుని చెప్పారు. ఇక సునీల్ చేయ‌బోయే పాత్ర‌ను థియేట‌ర్‌లోనే చూస్తే బాగుంటుంద‌ని వివ‌రించాడు నిర్మాత‌. కొవిడ్ ఎఫెక్ట్ త‌గ్గాక రెగ్యుల‌ర్ షూటింగ్ చేయ‌నున్నారు మూవీ మేక‌ర్స్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: