ఈ సినిమాలో నటించిన రానా, కాజల్ అగర్వాల్, కెథెరిన్ మరియు నవదీప్ లు వారి నటనతో తమ పాత్రలకు ప్రాణం పోశారు. జోగేంద్రగా రానా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక వడ్డీ వ్యాపారం చేసుకునే జోగేంద్ర అనే సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడు. తాను ముఖ్యమంత్రి కావాలనుకోవడానికి దారి తీసిన పరిణామాలను తెరకెక్కించిన తీరు అత్యద్భుతం. రానా కాజల్ ల మధ్య ఉన్న లవ్ అండ్ ఎమోషన్ హైలైట్. పటిష్టమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను 2 గంటల 33 నిముషాలపాటు సీట్లో కూర్చోబెట్టడంలో తేజ సక్సెస్ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టదు. క్లైమాక్స్ మాత్రం కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఆ కథకు సరిపడా దర్శకుడు రాజీ పడలేదు. ఈ సినిమాతో రానా సోలో హీరోగా మరియు చాలా కాలంగా సరైన హిట్ లేని దర్శకుడు తేజకి మంచి కిక్ తో పాటు హిట్ ను ఇచ్చింది.
ఈ సినిమా గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. * అంతే కాకుండా ఈ సినిమాకు మొదట అనుకున్న పేరు "అహం"
* అప్పుడు ఈ చిత్ర నిర్మాత పి సత్యనారాయణరెడ్డి మరొక హీరోని చూడమని చెప్పడంతో, అప్పుడు తేజ రానాని కలిసి చర్చించడంతో దీనికి హీరోగా చేయడానికి అతను అంగీకరించారు. అలా రానా ఈ ప్రాజెక్టులోకి రావడం జరిగింది.
* అదే సమయంలో ప్రధానమైన మహిళ పాత్ర కోసం రానా తండ్రి సురేష్ బాబు కాజల్ అగర్వాల్ పేరును సూచించారు. ఆ విధంగా కాజల్ అగర్వాల్ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. * ఆ తరువాత అప్పటికే తన దగ్గరున్న స్క్రిప్ట్ ని పలు మార్లు మార్చడం వలన ఆఖరుకి "నేనే రాజు నేనే మంత్రి" కథ సిద్ధం అయింది.
* ఈ సినిమా టీజర్ ను దగ్గుబాటి రానా తాత రామానాయుడు 81 వ పుట్టినరోజు కానుకగా 2016 జూన్ 6 న విడుదల చేశారు.* ఈ సినిమాలో కథానాయికగా నటించిన కాజల్ కు ఇది 50 వ చిత్రం కావడం విశేషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాజల్ కు సంబంధిచిన స్పెషల్ టీజర్ ను 2016 జూన్ 19 న విడుదల చేశారు.
* ఈ సినిమా 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, 45 కోట్ల వసూళ్లను సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది.
* ఈ సినిమా తెలుగులో భారీ విజయం సాధించడంతో, ఆ తరువాత హిందీ, తమిళ్ మరియు మలయాళ భాషల్లోనూ విడుదల కావడం విశేషం.
ఈ సినిమా ద్వారా తేజ సామాన్య వ్యక్తి ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించగలడు అని జోగేంద్ర పాత్ర ద్వారా అందరికీ తెలియచేశాడు. అంతే కాకుండా రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే కొన్ని తప్పులు చేయకతప్పదని వాస్తవ విషయాన్ని ప్రజలకు చెప్పాడు..jpg)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి