మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు తీస్తున్న శేఖర్ కమ్ములకు ఇప్పుడు కోలీవుడ్ హీరో ధనుష్ సపోర్ట్ లభించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఒకవైపు విలక్షణమైన సినిమాలలో నటిస్తూనే ధనుష్ బాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నాడు. ‘రంజాన’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్ ఆమూవీ ఫలితం ఆశాజనకంగా లేకపోయిన తన బాలీవుడ్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో ఒక కొత్త మూవీలో నటిస్తున్న ధనుష్ తన బాలీవుడ్ కెరియర్ కు వారధిగా శేఖర్ కమ్ములను ఎంచుకున్నాడు. ‘లవ్ స్టోరీ’ మూవీని నిర్మించిన ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ ఈమూవీని నిర్మిస్తున్నాడు. శేఖర్ కమ్ముల స్టైల్ లో ఉండబోయే ఈమూవీ కథ చాల డిఫరెంట్ గా ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి.
ధనుష్ ఇప్పటికే కోలీవుడ్ లో టాప్ హీరోల రేస్ లో దూసుకు పోతున్నాడు. దీనికితోడు ధనుష్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు రావడంతో అతడి మనోధైర్యం మరింత రెట్టింపు అయింది. ఎప్పటి నుండో ఇతడికి టాలీవుడ్ ఇండట్రీ పై కన్ను పడింది. ఇతడు నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ చేయడమే కాకుండా కొన్ని మంచి విజయాలు కూడ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తీస్తున్న పాన్ ఇండియా మూవీలో ధనుష్ నటిస్తూ ఉండటంతో ఆమూవీ విడుదల తరువాత అతడి మార్కెట్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో బాగా పెరిగే ఆస్కారం కనిపిస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి