అమాయకపు నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన చిత్రం స్వాతిముత్యం. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ నటనకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అయితే కమల్‌ హాసన్‌ నటించినటువంటి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని విక్రమ్‌ సరికొత్త పాత్రలో కనిపించాడు. దర్శకుడు విజయ్‌ తమిళంలో 'దైవతిరుమగన్‌' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో నాన్నగా విడుదల చేశారు. ఈ మూవీని మోహన్‌ నటరాజన్‌ సమర్పణలో ఎం.చింతామణి నిర్మించారు.



ఈ సినిమాలో మతి స్థిమితం లేని తండ్రిగా ‘నాన్న’ సినిమాలో విక్రమ్‌ జీవించేశాడు. ఇక తన చిన్నారి తల్లి అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని అమాయక తండ్రిగా బాగా ఆకట్టుకున్నాడు. అయితే మానసికంగా బలహీనుడైనా, ప్రేమను పంచడంలో ఆయన తక్కువేమీ కాదని చూపిస్తాడు దర్శకుడు. కూతురి మీద చూపించే ప్రేమ, శ్రద్ధ అబ్బురపరుస్తుంది. అంతేకాదు.. ఒంటరి తండ్రిగా కన్నబిడ్డను పెంచే క్రమంలో ఎదురయ్యే అవాంతరాలు, వాటిని ఎదుర్కొనేటప్పడు అతని అమాయకత్వం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇది సినిమా అనే కాదు.. నిజజీవితంలోనూ పిల్లలకు అమాయకంగా కనిపిస్తూనే ఆనందాలు పంచుతాడు నాన్న.


అయితే సినిమా మొత్తం సారా అనే బాలికకు, అతని నాన్న విక్రమ్‌కు మధ్య జరిగేదే సినిమా కథ. ఈ సినిమాలో అనుష్క లాయర్‌గా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. అన్ని భాషలోనూ ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక హీరో విక్రమ్ నటన గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఏ పాత్రలో అయినా యిట్టె ఒదిగిపోయి జీవించేస్తాడు. ఇక సినిమా చూశాక నాన్నతో ఇంకా ప్రేమగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతాన్ని అందించారు. ఆయన సంగీతం ప్రేక్షకుల హృదయాన్ని పిండేస్తుంది. అంతేకాదు.. ఈ సినిమాలో అమలాపాల్ విక్రమ్ భర్యగా నటిస్తుంది.  అనుష్క శెట్టి లాయర్ పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: