ప్రస్తుతం పవన్ క్రిష్ ల కాంబినేషన్ లో షూటింగ్ జరుపుకుంటున్న పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ గురించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ నటిస్తున్నాడు అన్నప్రచారం ఇప్పటికే కొనసాగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ పాత్రకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు షాక్ ను కలిగిస్తోంది.
ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నిధి నటిస్తోంది తెలుస్తంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న నిధికి ఇది పెద్ద అవకాశం అనిపించినా పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరో పక్కన ఒక యంగ్ హీరోయిన్ నెగిటివ్ పాత్రలో నటిస్తే జనం అదరిస్తారా అన్న సందేహాలు పవన్ అభిమానులకు వస్తున్నాయి. ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది.
బాలీవుడ్ స్టార్ అర్జున్ రామ్ పాల్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ 45 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈసినిమా పవన్ నటిస్తున్న ఫస్ట్ పీరియాడికల్ సినిమాగా రికార్డు క్రేయేట్ చేయబోతోంది.
హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని 2022 సంక్రాంతికి విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నా ఆ సమయానికి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యే అవకశాలు ఉండటంతో రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది అంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి