
వాస్తవానికి ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియకపోయినా అప్పుడే ఇండస్ట్రీలో ఎన్నికల వాతావరణం కనిపించడం హాట్ న్యూస్ గా మారింది. ఈ ఎన్నికలు ఇండస్ట్రీలో ఎన్ని వర్గాలను క్రియేట్ చేస్తాయో క్లారిటీ లేకపోయినా చిరంజీవికి మాత్రం ఈ ఎన్నికలు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మహాభారతంలో శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సమయంలో అటు పాండవులకు ఇటు కౌరవులకు సమన్యాయం చేసినట్లుగా ఇప్పుడు చిరంజీవి కూడ ఈ ఎన్నికలలో ఇరు వర్గాలకు పరోక్షంగా సహకరించ వలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి చిరంజీవికి మోహన్ బాబు తోను అదేవిధంగా ప్రకాష్ రాజ్ తోను మంచి సాన్నిహిత్యం ఉంది.
ఇప్పుడు ఈ సాన్నిహిత్యం వల్లనే మెగా స్టార్ కు ఈ కొత్త సమస్యలు అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ విషయంలో ఎదో ఒక రాజీ మార్గాన్ని అనుసరించి అటు ప్రకాష్ రాజ్ కు ఇటు మంచు విష్ణు కు సమన్యాయం చేయాలని చిరంజీవి ఆలోచన అని టాక్. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు తన స్పీడ్ ను మరింత పెంచి ఇండస్ట్రీలోని అనేకమంది సీనియర్ జూనియర్ యాక్టర్స్ ను కలుస్తూ తనకు రాబోతున్న ఎన్నికలలో ఓటు వేసి గెలిపిస్తే తాను ‘మా’ సంస్థ కోసం చేయబోయే కార్యక్రమాల వివరాలను చెపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో రాబోతున్న ‘మా’ సంస్థ ఎన్నికలు మరో చిన్న కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తూ పైకి మాత్రం ఏకంగా కనిపిస్తున్న ఇండస్ట్రీలోని వర్గాలను మరొకసారి బయటపెట్టి అవకాశం ఉంది అన్నఅభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి