గతేడాది మల్టీస్టారర్ మూవీ 'వి'తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసిన టాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ వంటి వైవిధ్యమైన సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో ఆయన లైటింగ్ సూరిబాబుగా కనిపించునున్నారు. ఐతే 70 ఎమ్ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి ప‌లాస 1978 ఫేమ్ క‌రుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలోనే ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ ని సుధీర్ బాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన పోర్షన్ కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసినట్లు ఆయన ఒక వీడియో తో సహా వెల్లడించారు. ఈ వీడియోలో సుధీర్ బాబు ఓ స్ట్రీట్ ఫైట్ సీన్‌కు డబ్బింగ్ చెప్తూ కనిపించారు. అయితే డైలాగులు అవసరం లేని ఈ ఫైట్ సీన్ కి డబ్బింగ్ ఫర్ఫెక్ట్ గా వచ్చేందుకు సుధీర్ బాబు మైక్ ముందు బాగా శ్రమపడుతూ కనిపించారు. ఇకపోతే ఈ ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి అని తెలుస్తోంది.



ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోష‌న్ పోస్టర్‌ లలో సుధీర్ బాబు కండలు తిరిగిన దేహంతో కనిపించి అంచనాలు పెంచే సారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చడం మరో హైలెట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంతో సుధీర్ బాబు ఈ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: