టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బన్ని కెరీర్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా సుకుమార్ తనదైన స్టైల్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇంతవరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్ని స్టైలిష్ రోల్స్ ల లోనే నటించారు. కానీ మొదటి సారి డీ గ్లామర్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటిస్తుంది.
మలయాళ నటుడు స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ తెలుగులో మొదటి సారి పరిచయం అవుతుండగా ఈ సినిమాలో ఆయన నటిస్తుండటం విశేషం. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని మేకర్స్ నిర్ణయించుకోగా షూటింగ్ సమయంలో ఎక్కువ నిడివి వస్తుండడంతో రెండు భాగాలుగా తీస్తే కథను మరింత బాగా చెప్పవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారట. హీరో అల్లు అర్జున్ కూడా దీనికి ఒప్పుకున్నట్లు సమాచారం.
కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో కూడా తిరిగి ప్రారంభించనున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో రెండవ పార్ట్ కి కొంత గ్యాప్ తీసుకుని తాను ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలనేది బన్నీ ప్లాన్. ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. నాలుగైదు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని బన్నీతో చర్చించారు ఐకాన్ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ బన్నీ వేసిన ఈ ప్లాన్ కి ఒప్పుకోవడం లేదట. ఒక ఫ్లో లో ఉన్నప్పుడే సినిమా షూటింగ్ బాగా వస్తుందని, గ్యాప్ వస్తే సినిమా పై ఇంట్రెస్ట్ ఉండదని ఆసక్తి తగ్గుతుందని దానివల్ల సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంటుందని బన్నీ కి చెప్పి ఒప్పించే పనిలో పడ్డారట. మరి వీరిద్దరిలో ఎవరు ఎవరిని కన్విన్స్ చేస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి