
మనం ఎలా ఉన్నా మనల్ని కడదాకా ప్రేమించేది కన్నతల్లి ఒకరే. మిగిలిన వారు అందరూ ఏదో ఒక స్టేజీలో మనల్ని దూరం పెట్టవచ్చు కానీ కన్నతల్లి మాత్రం మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ఎవరు నిర్లక్ష్యం చేసిన డాక్టర్లు నిర్లక్ష్యం చేయొద్దు అని అంటారు. పొరపాటున చేసే నిర్లక్ష్యం అయినా అది జీవితాంతం ఒక మనిషి నీ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ విధమైన నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు నటి లహరి. బంగారు పంజరం, అంతపురం సీరియల్ నటీమణి అయిన ఈ బాబీ లహరి ప్రస్తుతం అనుభవిస్తున్న మనో వేదన వర్ణనాతీతం. .
సినిమా ఇండస్ట్రీలోకి ఎలాగోలా అడుగుపెట్టి ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు బాబి లహరి. వారికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. రెండవసారి బాబు పుట్టినప్పుడు ఆరోగ్యంగానే పుట్టిన కార్పొరేట్ వైద్యుల కారణంగా అంగవైకల్యాన్ని పొందాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆమెకు అండగా ఉండాల్సిన వాళ్లే బాబును వదిలించుకోవాలి అంటూ సలహా ఇవ్వడంతో ఆమె చాలా మనో వేదన చెందారు. పుట్టింటి వారికి అత్తింటి వారికి కూడా దూరమై ఒంటరిగా ఇద్దరు పిల్లలను సాకుతున్నారు.
ఆమె కూతురు అనన్య పేరు మీద అనుధ అశ్రయ్ అనే ఎన్జీవో చారిటీ నిర్వహిస్తున్నారు. ఆమె పుట్టినప్పటికీ ఇలాంటి ఒక రోజు నేను ఫేస్ చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ లహరి తన బాధను పంచుకున్నారు. ఇలాంటి జీవితం కూడా ఉంటుందా అనిపించేది. నా బిడ్డ పుట్టినప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో నే ఉన్నాడు. అయితే డాక్టర్ కావాలనే వెంటిలేటర్ పై ఉంచే వారు.. డబ్బు కోసమే వాళ్ళు ఇలా చేశారు.. అందరూ దీనిని ఒప్పుకోరు.. కానీ వారి వల్ల ఒక లైఫ్ ఇలా అయిపోయింది. అందరం ఇబ్బంది పడుతున్నాం. పిల్లాడు పుట్టాక నాకు చూపించి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు అని తెలిసిన తర్వాత మా ఆయన ఒప్పించి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నా.. ప్రతినెల చెకప్ కి వెళ్తూ మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నా.. అయినా చివరి నిమిషంలో డబ్బు కోసం ఆశపడి డాక్టర్లు ఇలా చేశారు అన్నారు.