
సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య ప్రేమలు పెళ్లిళ్లు దాకా వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చొని క్యాన్సిల్ అవ్వడం సంచలనం గా నిలుస్తుంది. ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లు తమ ప్రేమను పెళ్లిళ్లు గా మార్చుకోవడంలో విఫలమయ్యారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ మెహరీన్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈ మధ్యనే బి అనే వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకోగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది ఈ హీరోయిన్. దాంతో తన ప్రేమను పెళ్లి దాకా తెచ్చుకోవడం లో విఫలమైన హీరోయిన్ గా మెహరీన్ నిలిచింది. ఆ విధంగా పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకున్న జంటలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్త తో ప్రేమలో పడి పెళ్లి దాకా వెళ్లి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ ఆమె పెళ్లి మాత్రం ఎందుకో ఆగిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ ను నెంబర్ వన్ హీరోయిన్ రష్మిక మందన కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో కూడా పెళ్లి వరకు వెళ్లలేకపోయింది. గతంలో వారికి ఎంగేజ్మెంట్ కాగా తన కెరీర్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నయనతార ప్రభుదేవా లు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామని పెళ్లి పీటల వరకు వెళ్లారు కానీ ప్రభుదేవా కు మరో వివాహం కావడం వల్ల ఆమె భార్య ఒత్తిడి వల్ల నయనతార ఆయనను పెళ్లి చేసుకోలేదు.
ఉదయ్ కిరణ్ సుస్మితా కొణిదెల వివాహం జరిపించాలని చిరంజీవి నిర్ణయించగా ఉదయ్ కిరణ్ ఈ వివాహం నుంచి తప్పుకున్నాడు. అఖిల్ , శ్రేయ భూపాల్ ల ఎంగేజ్మెంట్ జరగగా వివాహం చేసుకోలేదు వీరిద్దరూ. సిద్ధార్థ్ సమంతల ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు. విశాల్ అనిషా అనే అమ్మాయిని ప్రేమించడం వీరి పెళ్లి కూడా జరగలేదు. ఇంకా నయనతార శింబు, అంజలి జై, ఇలియానా ఆండ్రూ, దివి, శృతిహాసన్ మైకేల్, శింబు హన్సికల ప్రేమ లు కూడా పల్లెల దాకా వెళ్లలేదు వీరు అందరూ ప్రస్తుతం ఎవరికి వారు బ్రేకప్ చెప్పుకొని తమ పర్సనల్ జీవితాన్ని కెరియర్ ని ముందుకు సాగిస్తూ వెళ్తున్నారు.